NTR30 నుండి SSMB28 కి షిఫ్ట్ అయిన దర్శకుడు త్రివిక్రమ్.. మహేష్ తో చెయ్యబోయే సినిమా కోసం తనకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అలా వైకుంఠపురములో టీం తో పాటుగా హీరోయిన్ ని కీలక పాత్రధారులని వాడెయ్యబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్ కోసం కూడా త్రివిక్రమ్ సేమ్ టీం నే రిపీట్ చెయ్యడానికి, హీరోయిన్ గా పూజ హెగ్డే ని కంటిన్యూ చెయ్యడానికి రెడీ అయినా ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇక ఇప్పుడు మహేష్ కోసం కూడా త్రివిక్రమ్ సేమ్ ఫార్ములానే ఫాలో అవ్వబోతున్నాడంటే.. కాదు బాలీవుడ్ హాట్ భామ దిశా పటాని మహేష్ కోసం దిగబోతుంది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
రాధే మూవీ లో దిశా అందాలకు ఫిదా అయిన మహేష్.. మన సినిమాలో దిశా అయితే బావుంటుంది అని త్రివిక్రమ్ తో చెప్పాడనే టాక్ మొదలైంది. కానీ త్రివిక్రమ్ మనసులో పూజ హెగ్డే నే మహేష్ సరసన బావుంటుంది అని ఫిక్స్ అవుతున్నాడట. మహర్షి లో ఆల్రెడీ నటించేసాకదా.. దిశా పటాని అయితే ఫ్రెష్ జోడి గా అనిపిస్తుంది అనే మాట మహేష్ నుండి వస్తుంటే.. కాదు మనకి అచ్చొచ్చిన హీరోయిన్ పూజ హెగ్డే ఫేమ్ సినిమాకి యూస్ అవుతుంది అనేది త్రివిక్రమ్ మాటగా చెబుతున్నారు. మరి ఫైనల్ గా SSMB28 కి ఏ హీరోయిన్ ఫైనల్ అవుతుందో చూడాలి.