Advertisementt

ఏపీలో రెండు వారాల పాటు..

Mon 03rd May 2021 02:01 PM
ap government,jagan reddy,night curfew,2 weeks curfew  ఏపీలో రెండు వారాల పాటు..
Ap government announces 2 weeks curfew ఏపీలో రెండు వారాల పాటు..
Advertisement
Ads by CJ

కరోనా కట్టడి కోసం చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. కానీ రెండు తెలుగు రాష్ట్రాలు కరోనా కట్టడి లో భాగంగా కేవలం నైట్ కర్ఫ్యూ ని మాత్రమే ఫాలో అవుతున్నాయి. తెలంగాణాలో మరో వారం పాటు నైట్ కర్ఫ్యూ ని అమలు చేస్తామని ప్రకటించారు. ఇక ఏపీలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే ఇంటర్ పరీక్షలని వాయిదా వేసింది. అయితే ఏపీలో జగన్ లాక్ డౌన్ పెట్టొచ్చు అనే ప్రచారానికి తెర దించుతూ.. ఎల్లుండి నుండి రెండు వారాల పాటు కర్ఫ్యూ పెడుతున్నట్టుగా ప్రకటించింది. 

ఉదయం ఐదు నుండి మధ్యాన్నం 12 గంటల వరకు ఎలాంటి ఆంక్షలు లేవని, మధ్యాహన్నం 12 గంటల నుండి కర్ఫ్యూ అమలు చేస్తామని, దుకాణాలు, ప్రజా రవాణాలు అన్ని మధ్యాన్నం 12 నుండి బంద్ అని, కరోనా కట్టడి లో భాగంగా ఈ మధ్యాన్నం కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యులో ఆంక్షలు కఠినంగా అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో ఏపీ ప్రభుత్వం ఈ కర్ఫ్యూ నిర్ణయం తీసుకుంది. 

Ap government announces 2 weeks curfew:

AP Govt To Take Key Decision On Curfew 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ