Advertisementt

కెజిఫ్ 2 స్పెషల్ కోసం బాలీవుడ్ భామలు

Mon 03rd May 2021 05:00 PM
kgf chapter 2,yash,prashanth neel,nora fatehi,jacqueline fernandez,special song,item song  కెజిఫ్ 2 స్పెషల్ కోసం బాలీవుడ్ భామలు
Jacqueline Fernandez or Nora Fatehi special song in KGF 2 కెజిఫ్ 2 స్పెషల్ కోసం బాలీవుడ్ భామలు
Advertisement
Ads by CJ

ప్రశాంత్ నీల్ - యశ్ కాంబోలో కన్నడలో తెరకెక్కిన కెజిఎఫ్ మూవీ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అవడంతో.. కెజిఎఫ్ కి సీక్వెల్ మొదలు పెట్టారు. కెజిఎఫ్ సీక్వెల్ పై ఇండియా వైడ్ గా భారీ అంచనాలున్నాయి. ప్రశాంత్ నీల్ చూపించిన హీరో ఎలివేషన్ కే ఇప్పుడు స్టార్ హీరోలంతా ప్రశాంత్ నీల్ చుట్టూ తిరుగుతున్నారు. కెజిఎఫ్ లో హీరో ఎలివేషన్ కన్నా.. కేజిఎఫ్ 2 లో హీరో ఎలివేషన్ మరింత భీభత్సంగా ఉంది. కెజిఎఫ్ 2 టీజర్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది ఈ కాంబో.

అయితే కెజిఎఫ్ లో హీరోయిన్ కి అంతగా ప్రాధాన్యత లేకపోవడంతో.. ఆ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ పెట్టారు. దాన్ని సౌత్ బ్యూటీ తమన్నా తో చేయించారు. ఆ సాంగ్ మంచి హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు కెజిఎఫ్ సీక్వెల్ లోనూ ఓ అదిరిపోయే స్పెషల్ సాంగ్ పెట్టారట. అయితే దాని కోసం ఇద్దరు బాలీవుడ్ భామల పేర్లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ జాక్వలిన్ కానీ.. లేదంటే నోరా ఫతేహి తో కానీ చేయించాలని అనుకుంటున్నారట. గతంలో సౌత్ భాషలకి తమన్నా తో ఐటెం చేయించిన కెజిఎఫ్ టీం.. హిందీ కోసం మౌని రాయ్ ని తీసుకున్నారు. ఇప్పుడు సౌత్, నార్త్ కి సరిపోయే బాలీవుడ్ హీరోయిన్ తోనే ఈ సాంగ్ చేయిస్తే బావుంటుంది అని అనుకుంటున్నారట. 

అన్నట్టు కెజిఎఫ్ షూటింగ్ చివరి దశలో ఉండగా.. అందులో ఈ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ కూడా బ్యాలెన్స్ ఉందట.

Jacqueline Fernandez or Nora Fatehi special song in KGF 2:

KGF Chapter 2: Nora Fatehi Or Jacqueline Fernandez Will Be The New Inclusion?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ