Advertisementt

బాలయ్య ఆగేదేలే.. అంటున్నాడు

Mon 03rd May 2021 07:14 PM
balakrishna,boyapati,akhanda movie,pragya jaiswal,news schedule,balayya - boyapati  బాలయ్య ఆగేదేలే.. అంటున్నాడు
Balakrishna - Boyapati gearing up for the biggest risk బాలయ్య ఆగేదేలే.. అంటున్నాడు
Advertisement
Ads by CJ

బాలకృష్ణ - బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న అఖండ సినిమా షూటింగ్ కోవిడ్ 19 సెకండ్ వేవ్ వల్ల ఎక్కడా అంతరాయం అన్నదే కలగలేదు. బోయపాటి కరోనా జాగ్రత్తలతో సినిమా షూటింగ్ ని పరిగెత్తిస్తున్నాడు. బాలకృష్ణ విలన్ శ్రీకాంత్ మధ్యన పోరాట సన్నివేశాల చిత్రీకరికరణని వికారాబాద్ అడవుల్లో చేపట్టిన బోయపాటి.. కొద్దిపాటి గ్యాప్ తో రేపు 12 నుండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొత్త షెడ్యూల్ ని మొదలు పెట్టబోతున్నాడు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి చాలా సినిమాల షూటింగ్స్ ఆగిపోగా. పుష్ప షూటింగ్ నిన్నమొన్నటివరకు కరోనా కి ఎదురు నిలబడి జరిపినా అల్లు అర్జున్ కోవిడ్ బారిన పడడంతో చేసేది లేక పుష్ప షూటింగ్ కూడా ఆపేసారు.

కానీ బాలకృష్ణ ఆగేదెలే అంటూ అఖండ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సీనియర్ హీరోలైన నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ లు కరోనా సెకండ్ వేవ్ తో పోరాటం చెయ్యడం అవసరమా.. అంటూ షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసినా ఈ వయసులో బాలకృష్ణ మాత్రం రిస్క్ చేస్తున్నారనే చెప్పాలి. చిన్న చితక, భారీ బడ్జెట్, మీడియం బడ్జెట్ మూవీస్ షూటింగ్స్ మొత్తం వాయిదా వేసినా అఖండ షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక రేపు 12 న మొదలు కాబోయే కొత్త షెడ్యూల్ లో కూడా పరిమిత సంఖ్యలో అంటే అతి తక్కువమంది టీమ్ తో అఖండ షూటింగ్ పూర్తి చేసేయాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నాడు. 

ఈ షెడ్యూల్ లో కేవలం బాలయ్య - ప్రగ్య జైస్వాల్ మీదే సన్నివేశాల చిత్రీకరణ ఉంటుంది అని, అలాగే కొద్దిమంది జూనియర్ ఆర్టిస్ట్ లతో ఈ షెడ్యూల్ ని కంప్లీట్ చెసేస్తారట. 

Balakrishna - Boyapati gearing up for the biggest risk:

Balakrishna is all set to start the new schedule of Akhanda from May 12th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ