Advertisementt

హై కోర్టుని ఆశ్రయించిన జమున హ్యాచరీస్

Tue 04th May 2021 10:37 AM
jamuna hatcheries,etela rajendra,appealing,high court  హై కోర్టుని ఆశ్రయించిన జమున హ్యాచరీస్
Jamuna Hatcheries Approached the High Court హై కోర్టుని ఆశ్రయించిన జమున హ్యాచరీస్
Advertisement
Ads by CJ

తెలంగాణ మాజీ మంత్రి లిస్ట్ లోకి వెళ్ళిన ఈటెల రాజేంద్ర పై భూ కబ్జా ఆరోపణలు నిజమే అని నిర్దారణ అవడంతో ఆయనపై వేటు పడింది. తెలంగాణ మంత్రి మండలి నుండి ఈటెల రాజేంద్రని తప్పించారు సీఎం కేసీఆర్. ఇక ఈటెల పై కేసు నమోదు కావడం అరెస్ట్ కూడా అవుతారంటూ వార్తలు వస్తున్న వేళ ఈటెల రాజేంద్ర ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేసులకు భయపడం, నోటీసు లు ఇవ్వకుండా మా భూముల్లో సర్వే ఎలా చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. కోర్టుకు వెళతాం, తప్పు ఉంటె శిక్ష అనుభవిస్తా ఆంటూ సవాల్ చేసారు ఈటెల.

అన్నట్టుగానే ఈటెల రాజేంద్రకి సంబందించిన జమున హ్యాచరీస్ ఈ రోజు తెలంగాణ హై కోర్టుని ఆశ్రయించింది. ఎలాంటి నోటీసులు లేకుండా తమ భముల్లో సర్వే చేసారని, మెదక్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉంది అని, అచ్చంపేట భూముల్లో అనుమతి లేకుండా ప్రవేశించి సర్వే చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ వేసింది. జమున హ్యాచరీస్ వేసిన పిటీషన్ పై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక ఈటెల ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చెయ్యబోతున్నారంటూ ఊహాగానాలతో పాటుగా.. ఆయన భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారము జరుగుతుంది. 

Jamuna Hatcheries Approached the High Court:

Jamuna Hatcheries appealing to the High Court

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ