విజయ్ దేవరకొండ అంచెలంచెలుగా అతి తక్కువ సమయంలో స్వశక్తితో ఎదిగిన హీరో. ప్రస్తుతం విజయ్ రేంజ్ పాన్ ఇండియా లెవల్. అదే మాదిరి ఫలక్నుమా దాస్ విశ్వక్ సేన్ కూడా.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి హీరోగా నిలదొక్కుకుంటున్నాడు. అయితే విశ్వక్ సేన్ ఫలక్నుమా దాస్ టైం లో విజయ్ దేవరకొండ ని ఏదో అన్నాడని విజయ్ ఫాన్స్ విశ్వక్ సేన్ ని వెంటాడారు. ఫలక్నుమా దాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇప్పటికే ఒకణ్ణి పైకి లేపాము.. ఇప్పుడు మరొకడు తయారయ్యాడు వీణ్ణి తొక్కేద్దాము.. అని ఎవరో అన్న దానికి విశ్వక్ సేన్ ఈవెంట్ లో నన్ను ఎవరూ పైకి లేపొద్దు, నాకు నేనే లేస్తాను అంటూ మాట్లాడడంతో అది విజయ్ నే అన్నారనుకుని విశ్వక్ పై విజయ్ ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసారు
అప్పట్లో అది పెద్ద సెన్సేషన్ అయినా.. ఆ విషయంలో అటు విశ్వక్ కానీ, ఇటు విజయ్ కానీ ఎవరూ స్పందించలేదు. అయితే తాజాగా అలీ తో జాలిగా ప్రోగ్రాంలో విశ్వక్ సేన్ ఆ విషయమై క్లారిటీ ఇచ్చాడు. నాకు విజయ్ దేవరకొండ కి శత్రుత్వం కానీ, ఫ్రెండ్ షిప్ కానీ లేవని అయితే ఫలక్ నుమా దాస్ ఈవెంట్ టైం లో ఓ నిర్మాత ఇప్పటికే ఒకణ్ణి హీరోగా పైకి లేపాము.. ఇప్పుడు ఇంకొకడు.. వీణ్ణి తొక్కేయ్యాలి అనగానే కాస్త ఫీలై ఫలక్ నుమా దాస్ స్టేజ్ మీద ఆ ప్రష్టేషన్ లో వచ్చిన మాటలు తప్ప నేను ఎవరిని ఉద్దేశించి అనలేదని.. ఇప్పటికి నన్ను ఎవరూ పైకి లేపక్కర్లేదు అని, నాకు నేనుగా హీరోగా పైకి లేస్తాను అంటూ మాట్లాడాడు విశ్వక్ సేన్.