కరోనా తో చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూ లతో ఇంటికే పరిమితమవుతున్న యూత్ ని బాగా ఎంటర్టైన్ చేస్తున్న ఐపీఎల్ కి కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. గత ఏడాది ఐపీఎల్ ని ఆచి తూచి మొదలు పెట్టిన బిసిసిఐ.. ఈ ఏడాది సెకండ్ వేవ్ మొదలయ్యే టైం లో మొదలు పెట్టినా.. ఇన్ని రోజులు చాలా జాగ్రత్తలతో ఐపీఎల్ నిర్వహించింది. కానీ గత రెండు రోజులుగా కొన్ని జట్లు లోని ఆటగాళ్లు, కోచ్ లు కరోనా పోజిటివ్స్ రావడంతో నిన్న ఒక మ్యాచ్ ని క్యాన్సిల్ చేసింది బిసిసిఐ.
కానీ నేడు ఐపీఎల్ ఆటగాళ్లు వరసగా కరోనా బారిన పడడంతో ఐపీఎల్ ని నిరవధికంగా వాయిదా వేశారు. కోల్కత్తా నైట్ రైడర్స్ ఆటగాళ్లకు, ఈ రోజు SRH ఆటగాడు వృద్ధిమాన్ కి కరోనా పాజిటివ్ రావడంతో.. కొన్ని జట్లు కోచ్ లకి కరోనా సోకడంతో ఐపీఎల్ ని వాయిదా వేస్తున్నట్లుగా బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ లో సినిమాలు, ఎంటర్టైన్ లేకపోయినా.. యువత క్రికెట్ ని విపరీతంగా వీక్షిస్తున్నారు. మరి కరోనా మహమ్మారికి అందరూ తలవంచినట్లుగా ఇప్పుడు ఐపీఎల్ కూడా తలవంచక తప్పలేదు.