సుకుమార్ - అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిలిం పుష్ప షూటింగ్ ప్రస్తుతం కరోనా కారణంగా వాయిదా పడింది. అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్ రావడం, విలన్ కేరెక్టర్ చేస్తున్న మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రస్తుతం షూటింగ్ చేయలేనని చెప్పడంతో సుకుమార్ కి ఎట్టకేలకి షూటింగ్ ఆపక తప్పలేదు. అయితే ఈ సినిమాలో రష్మిక మందన్న అల్లు అర్జున్ కి జోడిగా నటిస్తుంటే.. ఐటెం సాంగ్ మాత్రం బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేల్లా చేస్తుంది అనే టాక్ ఉంది.
ఇప్పుడు సుకుమార్ నుండి ఆచార్య లో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ కి పుష్ప లో ఐటెం సాంగ్ చెయ్యమని కాల్ వెళ్ళినట్టుగా టాక్. కాజల్ కే ఎందుకంటే.. కాజల్ అగర్వాల్, కొరటాల - ఎన్టీఆర్ కాంబో మూవీ జనతా గ్యారేజ్ లో పక్కా లోకల్ అనే ఐటెం లో అదరగొట్టడం, రంగస్థలం లో పూజ హెగ్డే లాంటి టాప్ హీరోయిన్ తో ఐటెం సాంగ్ చేయించిన సుకుమార్ ఈ సినిమాలో ఫారెస్ట్ బ్యాగ్డ్రాప్ లో ఉండబోయే ఐటెం సాంగ్ లో కాజల్ అయితే ఎలా ఉంటుంది అనే డిస్కర్షన్ పెట్టినట్లుగా తెలుస్తుంది.
ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ ఎవరూ అవైలబుల్ గా లేరు. అందుకే కాజల్ అయితే బావుంటుంది అనే ఆలోచనలో సుక్కు - బన్నీ ఉన్నారట. ఎలాగూ కాజల్ అగర్వాల్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో వచ్చిన ఆర్య 2 లో నటించింది. ఇప్పుడు అదే కాంబోలో వస్తున్న సినిమాలో కాజల్ ఐటెం కి ఒప్పుకుంటుందా? పక్కా లోకల్ తర్వాత కాజల్ మరో స్పెషల్ సాంగ్ కి సైన్ చేస్తుందా? చూద్దాం.