Advertisementt

రవితేజ ఖిలాడీ రిలీజ్ వాయిదా

Wed 05th May 2021 11:31 AM
ravi teja,ramesh varma,krack movie,khiladi movie,khiladi postponed,corona second wave  రవితేజ ఖిలాడీ రిలీజ్ వాయిదా
Khiladi Movie release postponed రవితేజ ఖిలాడీ రిలీజ్ వాయిదా
Advertisement
Ads by CJ

రవితేజ క్రాక్ హిట్ జోరుతో.. రమేష్ వర్మ తో చకచకా ఖిలాడీ మూవీ ని ఫినిష్ చేసేసి మే 28 న రిలీజ్ కి సిద్ధం చేసేద్దామనుకున్నాడు. రమేష్ వర్మ తో గ్యాప్ లేకుండా షూటింగ్ చేయించిన రవితేజకి కరోనా సెకండ్ వేవ్ ముందుగా షాకిచ్చింది. అందరికన్నా ముందు ఖిలాడీ మూవీ షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. ఇటలీలో కరోనా నిభంధనలతో లాక్ డౌన్ పెట్టెయ్యడంతో అందరికన్నా ముందే ఖిలాడీ టీం హైదరాబాద్ కి వచ్చేసింది. అయితే ఈనాటి వరకు ఖిలాడీ సినిమా అదే మే 28 డేట్ కి వస్తుంది అనుకున్నా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్యా సినిమాని పోస్ట్ పోన్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.

రవితేజ ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్న ఈ సినిమాలో అనసూయ ఓ కీలక పాత్ర చేస్తుంది. రవితేజ తో ఢీ అంటే ఢీ అనే పవర్ ఫుల్ పాత్రలో అనసూయ నటిస్తుంది అనే టాక్ ఉంది. ఇక మే 28 న సినిమా ని రిలీజ్ చెయ్యడం సాధ్యమయ్యే పని కాదని ఖిలాడీ టీం.. సినిమాని పోస్ట్ పోన్ చెయ్యడం ఉత్తమం అని భావించి.. సినిమా ని పోస్ట్ పోన్ చేస్తున్నారట. ఖిలాడీ సినిమా వాయిదా వేస్తున్నామనే విషయం అధికారికంగా ప్రకటించబోతుంది టీం. అలాగే పరిస్థితులు అనుకూలించాక ఖిలాడీ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది.

Khiladi Movie release postponed :

Ravi Teja Khiladi Movie release postponed due to corona second wave 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ