తమిళనాడులో మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించి అసెంబ్లీ ఎన్నికలని పూర్తి చేసిన కమల్ హాసన్.. కోయంబత్తూర్ నుండి పోటీ చేసి ఓడిపోయారు. తన పార్టీ అభ్యర్థి ఒక్కరు కూడా గెలవలేదు.. ఆయన పార్టీకి ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలేదు. దీని పట్ల కమల్ హాసన్ అభిమానులు కాస్త బాధపడుతున్నా.. కొంతమంది రాజకీయ విశ్లేషకులు కమల్ ఓటమి బాధాకరమైన విషయమని చెబుతున్నా.. కమల్ ఓటమిపై ఆనందించే వ్యక్తులు కూడా ఉన్నారంటే వాళ్ళ గురించి చెప్పుకోవాలి. వాళ్లెవరో కాదు పవన్ కళ్యాణ్ ఫాన్స్. ఇక్కడ మాత్రం పవర్ స్టార్ ఫాన్స్ కమల్ ఓటమిపై సంబరాలు చేసుకుంటున్నారు.
ఎందుకు అంటే గత ఎన్నికల్లో జనసేన పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా పవన్ కళ్యాణ్ ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే. ఆ ఎన్నికల్లో పవన్ జనసేన పార్టీ ఎక్కడా కనిపించకుండా పోయింది. పవన్ కళ్యాణ్ పార్టీకి కొన్ని చోట్లా డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇన్ని రోజులు సోషల్ మీడియాలో ప్రత్యర్థులపై మాటల దాడికి దిగుతూ.. పవన్ ఓటమిని ఎలా డైజెస్ట్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడ్డారు. కానీ పవన్ ఫాన్స్ కి ఇప్పుడొక ఆయుధం దొరికినట్లయింది.. కమల్ ఓటమి రూపంలో.
ఇంత ఎక్సపీరియెన్స్ ఉన్నా, అంత పెద్ద స్టార్ హీరోనే ఒక్క సీటు కూడా తెచ్చుకోలేక ఓడిపోయాడు.. అంటూ పవన్ ని డిపెండ్ చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసారు. నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఈ వెపన్ చాలు ప్రత్యర్థులపై ఫైట్ చెయ్యడానికి అంటున్నారు పవన్ ఫాన్స్. ఆ విధంగా కమల్ ఓటమి ఇక్కడ కలిసొచ్చింది. కానీ కమల్ ఓటమి పై సంబరం సబబేనా ఆలోచించండి..