కరోనా దెబ్బ కి సెలబ్రిటీస్ విలవిల్లాడుతున్నారు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు, నార్త నుండి సౌత్ వరకు ఈ కరోనా కాటుకి సెలబ్రిటీస్ ఒణికిపోతున్నారు. బాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీస్ కరోనా బారిన పడి కోలుకోగా.. రీసెంట్ గా దీపికా పడుకొనే ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడింది. ఇక కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ గా నిర్దారణ అవడంతో హాట్ హీరోయిన్ పూజ హెగ్డే కూడా హోమ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోయింది. మధ్యలో హెల్త్ అప్ డేట్ కూడా ఇచ్చింది.
ఒక రోజు ఉదయం పూజ ఫ్రెష్ గా.. కరోనా తో ఇంట్లోనే ఉండి తాను కరోనాపై పోరాడుతున్న విషయాన్నీ తెలియాజేసింది. తాజాగా తనకి కరోనా నెగటివ్ గా నిర్ధారణ అయ్యింది అని, కరోనాని మీ అందరి ప్రేమాభిమానాలతో తన్ని తరిమేశాను.. నేను పూర్తిగా సేఫ్ గా ఉన్నా అంటూ ట్వీట్ చేసింది. తనపై చూపుతున్న అభిమానుల ప్రేమకి కృతజ్ఞతలు చెప్పిన పూజ హెగ్డే కరోనా తో అందరూ జాగ్రత్తగా ఉండమని చెబుతుంది.