సింగర్ సునీత కేవలం సింగర్ మాత్రమే కాదు.. ఆమె ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్ అన్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే మాంగో రామ్ ని రెండో పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సునీత భర్త తో తన పిల్లలతో హాయిగా గడిపెయ్యడమే కాదు.. అటు స్వరాభిషేకం లోనూ, ఇటు మూవీ సాంగ్ తోనూ బాగా బిజీ అయ్యింది. అయితే తాజాగా సునీత ఓ ఇంటర్వ్యూ లో తనని ఓ డైరెక్టర్ ఏడిపించిన విషయం చెప్పింది. మీ కెరీర్ లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారెవరైనా ఉన్నారా అని అడగగా.. అలా ఏడిపించిన సందర్భాలు లేకపోయినా.. ఓ డైరెక్టర్ నన్ను కాస్త ఇబ్బంది పెట్టారని చెప్పింది సునీత.
తాను ఓ సినిమాకి డబ్బింగ్ చెప్పడానికి డబ్బింగ్ స్టూడియో కి వెళ్ళినప్పుడు తన దగ్గరకి ఆ సినిమా డైరెక్టర్ వచ్చి సునీత గారు నేను మీకు పెద్ద ఫ్యాన్ ని. మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తునాను అంటూ చాలా ఎగ్జైట్ అయ్యారు.. నేను నవ్వి వెళ్లి పోయాను. అయితే నేను డబ్బింగ్ చెబుతున్నప్పుడు ఆయన అప్పుడప్పుడు వచ్చేవారు. ముందు సునీత గారు, మేడం అన్న ఆయన తర్వాత సునీత అంటూ.. ఆ తర్వాత అమ్మా, బుజ్జి, కన్నా అంటూ కొంచెం ఎక్కువ చేసారని.. అదృష్టం వలన ఆ డైరెక్టర్ తనకి మరోసారి కనిపించలేదని.. అప్పుడు కాస్త భయమేసింది అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఆ డైరెక్టర్ ఎవరో మాత్రం సునీత రివీల్ చెయ్యలేదు.