వైసిపి మంత్రులు ప్రతి పక్షంపై బూతులు తో రెచ్చిపోతున్న విషయం తరుచూ చూస్తూనే ఉన్నాము. ఏపీలో వైసిపి ప్రభుత్వం వచ్చాక టిడిపి నాయనకులని వరసగా అరెస్ట్ లు చేయిస్తూ రాష్ట్రంలో ప్రతి పక్షం అన్నది లేకుండా చేసే కుట్రలు జరుగుతున్నాయంటూ టిడిపి నాయకులు ఎప్పటినుండో గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించిన వారికి జైలు ఊచలు చూపిస్తుంది వైసిపి ప్రభుత్వం. వారు గతంలో చేసిన అక్రమాలని తవ్వి జైలుకి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా గుడివాడ ఎమ్యెల్యే మంత్రి కొడాలి నాని చంద్రబబు పై విరుచుకుపడ్డాడు.
చంద్రబాబు నాయుడు కర్నూలులో కొత్త కరోనా వైరస్ అంటూ ప్రజలని భయ బ్రాంతులకి గురి చేస్తున్నారని, కొత్త వైరస్ వచ్చింది కర్నూల్ లో కాదని నారా వారి పల్లెలో అని, అది నారా వైరస్ అని చంద్రబాబు, లోకేష్ లు కరోనా వ్యాక్సిన్ సింగపూర్ నుండి తెప్పించుకుని తమ ఇంట్లో నలుగురు వేయించుకుని తలుపులు వేసుకుని కూర్చున్నారని, మిగతా టిడిపి నాయకులకి కరోనా వ్యాక్సిన్ వేయించలేదంటూ కొడాలి నాని చంద్రబాబు పై విరుచుకుపడ్డాడు. చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపై జూమ్ యాప్ లో విష ప్రచారం చేస్తున్నారని.. రోజుకు 10 లక్షల వ్యాక్సిన్లు వేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని కొడాలి సవాల్ విసిరాడు.
వ్యాక్సిన్ కోసం జగన్ ప్రభుత్వం మోడీ కి లేఖ రాసింది అని చంద్రబాబు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 నాయుడుల కంటికి అవేమి కనిపించడం లేదంటూ ఇష్టం వచ్చినట్టుగా మీడియా ముందు నోరు పారేసుకున్నాడు కొడాలి నాని.