గురువారం వచ్చింది అంటే యూత్ మొత్తం అలెర్ట్ అవుతుంది. ఎందుకు అంటే జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్ కోసం. జబర్దస్త్ స్టేజ్ మీద అనసూయ డాన్స్ , ఆమె గ్లామర్ అన్ని ఓకె. కానీ ఆ రోజు ఉదయం ఆమె పోస్ట్ చేసే ఫొటోస్ కోసం కూడా తెగ వెయిట్ చేస్తారు యూత్. అంత అందమైన ఫోజులతో మతులు పొగడుతుంది అనసూయ. ఇప్పుడు గురువారం వరకు ఆగక్కర్లేదు. ఆమె నటించిన థాంక్యూ బ్రదర్ మూవీ ప్రమోషన్స్ కోసం అనసూయ బయలుదేరేటప్పడు ఫోటో షూట్ చేయించుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అంటే ఓపెన్ ప్రెస్ మీట్స్ లేకపోయినా అనసూయ థాంక్యూ బ్రదర్ మూవీ ని యూట్యూబ్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ లో ఇంటర్వ్యూ ఇస్తూ ప్రోమోట్ చేస్తుంది.
అందుకే రోజుకో ఫోటో షూట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కవ్విస్తుంది. కాటన్ చుడి దార్స్, కాటన్ సారీన్, లేటెస్ట్ జీన్స్ ప్యాంట్స్, టి షర్ట్స్ అబ్బో ఒకటేమిటి అనసూయ అదిరిపోయే డ్రెస్సులతో అదరగొట్టేసే ఫోటో షూట్స్ తో ఆకట్టుకుంది. చిన్న చిన్న ఫ్రాక్స్ లో అందాలను చూపిస్తూ కవ్విస్తుంది. అంతేనా అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్ లో ఆమె కన్ను కొడుతూ అదేనండి కన్ను గీటుతూ ఉన్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ రోజు ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ కోసం స్పెషల్ గా రెడీ అయిన అనసూయ అలా కన్ను కొడుతూ కవ్విస్తుంది. మరి మీరు ఆ పిక్ ని లుక్కెయ్యండి.