జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ బుల్లితెర మీదే కాదు, వెండితెర మీదా వెలిగిపోతుంది. బుల్లితెర మీద జబర్దస్త్ యాంకర్ గా గ్లామర్ ఆరబోసే అనసూయ వెండితెర మీద నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతో దూసుకుపోతుంది. హీరోయిన్ ఓరియెంటెడ్ కథలకి, పాత్రకి ప్రాధాన్యమున్న కథలకి ఓకె చెబుతున్న అనసూయ ఆ సినిమాలు అనుకున్న సక్సెస్ ఇవ్వకపోయినా.. అనసూయ యాక్టింగ్ కి మంచి మార్కులు పడుతున్నాయి. రీసెంట్ గా రిలీజ్ ఆయన థాంక్యూ బ్రదర్ మూవీ ప్రమోషన్స్ లో అనసూయ చాలా విషయాలను పంచుకుంటుంది. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో యాంకర్.. అనసూయ గారు మీకు ఎలాంటి కథలు నచ్చుతాయి. మీరు పారితోషకం విషయంలో కాస్త గట్టిగా ఉంటారంటే అనగా..
అలాంటిదేం లేదు.. ముందు నా పాత్ర ఎలా ఉందో చూసుకుంటాను. అలాగే కథ ఎలా ఉందో ముఖ్యం, ఆ తర్వాత దర్శకుడు ఎవరు, హీరో ఎవరు అనేది ముఖ్యం కానీ.. పారితోషకం ముఖ్యం కాదు. అన్నిటికన్నా చివర నేను రెమ్యునరేషన్ కోసం ఆలోచిస్తాను అంటుంది అనసూయ. అన్నట్టు అనసూయ రవితేజ ఖిలాడీ, పుష్ప లో ఓ కీ రోల్ పోషిస్తుందన్న విషయం తెలిసిందే.