కరోనా సెకండ్ వేవ్ తో ఎన్ని సినిమాల షూటింగ్స్ కి బ్రేకులు పడినా ప్రభాస్ ఇంకా ఆదిపురుష్ సినిమా షూటింగ్ లోనే పాల్గొంటున్నాడు. ముంబై లో పరిస్థితులు అనుకూలించక ఆదిపురుష్ టీం మొత్తం హైదరాబాద్ లో అడుగుపెట్టబోతుంది. ప్రభాస్ తో ఆదిపురుష్ తెరకెక్కిస్తున్న దర్శకుడు ఓం రౌత్ టీం భద్రతా దృష్యా ముంబై లో ఆదిపురుష్ సెట్ లో షూటింగ్ చెయ్యడం మంచిది కాదని.. సెకండ్ వేవ్ మహారాష్ట్రాని కుదిపేయడంతో హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఆదిపురుష్ సెట్ ని చక చకా నిర్మించి అదే సెట్ లో ఓ మూడు నెలలపాటు విరామం లేకుండా షూటింగ్ చెయ్యాలని డిసైడ్ అయ్యి హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేశారు. అదే సెట్ లో ప్రభాస్, సీత పాత్రధారి కృతి సనన్.. ఇంకా మిగతా నటులు, విలన్ సైఫ్ అలీ ఖాన్ లు పాల్గొనబోతున్నారట.
ఇక ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ తో పాటు .. మరో పాన్ ఇండియా ఫిలిం సలార్ షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నాడట. కరోనా బాడ్ సిట్యువేషన్ లో ప్రభాస్ సలార్ సెట్ కి, ఆదిపురుష్ సెట్ కి తిరగక్కర్లేకుండా.. సలార్ సెట్ ని కూడా రామోజీ ఫిలిం సిటీలో భారీగా నిర్మించారట. ఎలాగూ కెజిఎఫ్ రీలీజ్ ని జులై నుండి దసరా బరికి మార్చాలనే యోచనలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఉండి.. ప్రబస్ సలార్ కి ఇచ్చిన డేట్స్ ని వాడుకోవాలని డిసైడ్ అయ్యి రామోజీ ఫిలిం సిటీలో వేసిన సలార్ సెట్ లో ప్రభాస్ తో మరో షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నాడట. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ తో హీరోయిన్ శృతి హాసన్ కూడా పాల్గొనబోతుందట. అంటే హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీలో ప్రభాస్ రెండు సినిమా షూటింగ్స్ తో బిజీ అన్నమాట. అనుకున్నట్టుగానే ప్రభాస్ తన సినిమాలను అనుకున్న డేట్స్ కి రిలీజ్ చెయ్యడం పక్కాగా కనిపిస్తుంది.