సింగర్ సునీత రెండో పెళ్ళికి ముందు కూడా ఎప్పుడూ వార్తల్లో ఉండే సెలెబ్రిటీనే. సింగర్ సునీత తన మొదటి భర్త తో విడాకులు తీసుకునే విషయం కానివ్వండి.. ఆమె రెండో పెళ్లి మేటర్ కానివ్వండి ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉండేది. అయితే మ్యాంగో రామ్ తో సునీత సెకండ్ మ్యారేజ్ మేటర్ చెప్పాక కూడా ఆమె పెళ్లి సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. రామ్ తో ఏడడుగులు వేసేముందు సునీత - రామ్ దంపతుల ఇచ్చిన పార్టీలు మీద చర్చలు నడిచాయి. ఇక పెళ్లి తర్వాత సునీత భర్త రామ్ తో హాయిగా గడిపేస్తూనే అటు సింగర్ గానూ బిజీ అయ్యింది. అలాగే సోషల్ మీడియాలోనూ ఆక్టివ్ గా మారింది.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అభిమానులతో లైవ్ చాట్ చేస్తుంది సునీత. కోవిడ్ కారణముగా తాను షూటింగ్స్ కి వెళ్లడం లేదని, తన ఫ్యామిలీ ని జాగ్రత్తగా చూసుకోవడం కోసం తాను ఇంటిపట్టున ఉంటున్నట్లుగా చెప్పింది. ఇక కోవిడ్ సోకినా వారు మనో ధర్యం కోల్పోవద్దని.. ఆక్సిజెన్, బెడ్స్ కోసం పేషేంట్స్ కష్టాలు పడుతున్నారని, వారి కోసం సహాయం చెయ్యాలని, అభిమానులని కోరిన సునీత.. తాను సహాయం చేస్తున్నట్లుగా చెప్పింది. తాను సింగర్ ని కనక పాడుతూ అందరిని హ్యాపీగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నా అంటుంది. ఇక ఒక నెటిజెన్ సింగర్ సునీతని మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి ప్లీజ్ అని అడగగా.. సునీత మాత్రం నవ్వుతూ తనదైన స్వీట్ వాయిస్ తో సో సారీ అండి అంటూ ఆ నెటిజెన్ కి షాకిచ్చింది.