Advertisementt

ఎన్టీఆర్ కి కరోనా పాజిటివ్

Mon 10th May 2021 04:07 PM
tollywood top star,jr ntr,tested,positive,covid-19  ఎన్టీఆర్ కి కరోనా పాజిటివ్
Jr NTR tested Covid-19 positive ఎన్టీఆర్ కి కరోనా పాజిటివ్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ అగ్రహీరోలంతా వరసగా కరోనా బారిన పడుతున్నారు. ఈమధ్యనే పవన్ కళ్యాణ్ కరోనా నుండి కోలుకున్నారు. తర్వాత అల్లు అర్జున్ కి కరోనా రాగా ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఇక తాజాగా తారక్ కూడా కరోనా బారిన పడ్డారు. తనకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లుగా ట్వీట్ చేసాడు ఎన్టీఆర్.  తనకి  స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో డాక్టర్స్ చెప్పిన ప్రికాషన్స్ తో చికిత్స పొందుతున్నాని, ఎవరూ కంగారు పడాల్సిన పని లేదని ఎన్టీఆర్ ట్వీట్ చెయ్యడంతో ఆయన అభిమానులు తేరుకున్నారు.

త్వరలోనే ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలని ఓ రేంజ్ లో చెయ్యాలి, ఎన్టీఆర్ గత బర్త్ డే కరోనా తో మిస్ అయినా ఈ బర్త్ డే కి కరోనా ఉన్నా.. ఆయనకి ఆర్.ఆర్.ఆర్ నుండి వచ్చే ట్రీట్ తో రికార్డులు సృష్టించే ప్లాన్ లో ఉండగా.. ఇలా ఎన్టీఆర్ కరోనా పాజిటివ్ రావడంతో అభిమానులలో ఆందోళన నెలకొంది.. ప్రస్తుతం ఆయన సేఫ్ గా ఉండడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ కి పాజిటివ్ వచ్చిన కారణముగా తనతో కాంటాక్ట్ అయిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని ఎన్టీఆర్ కోరాడు. 

Jr NTR tested Covid-19 positive:

Tollywood top star Jr NTR has tested positive for Covid-19

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ