Advertisementt

లాక్ డౌన్ లో ఇల్లు కొన్నా అంటున్న హీరోయిన్

Tue 11th May 2021 01:30 PM
shruti hassan,vakeel saab heroine,shruthi independent and during,lockdown period  లాక్ డౌన్ లో ఇల్లు కొన్నా అంటున్న హీరోయిన్
Shruti Haasan Opens Up On Her Individual Life లాక్ డౌన్ లో ఇల్లు కొన్నా అంటున్న హీరోయిన్
Advertisement
Ads by CJ

కరోనా కారణంగా సినిమా షూటింగ్స్ ఎక్కడికక్కడే ఆగిపోతున్నాయి. భారీ బడ్జెట్ తో సెట్ లని నిర్మించిన నిర్మాతలు గత ఏడాది లాక్ డౌన్  తోనే బోలెడంత నష్టపోయారు. ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ ఎప్పుడు శాంతిస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అయితే కోలీవుడ్ హీరోయిన్ శృతితో హాసన్ మాత్రం కరోనాకి భయపడేది లేదు.. నేను ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ నుండి ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు షూటింగ్ కి తయ్యార్ అంటుంది. తండ్రి కమల్ హాసన్ నుండి రూపాయి కూడా ఆశించకుండా తన ఖర్చుల కోసం తానే సంపాదించుకుంటా అంటుంది శృతి హాసన్. నాకు సహాయం చెయ్యడానికి అమ్మా నాన్న లేరు. అంటే నేను వారి మీద ఆధారపడను అని దానర్ధం అంటుంది శృతి హాసన్.

నేను నా కాళ్ళ మీద నిలబడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను. నా ఖర్చులకి నేనే సంపాదించుకుంటాను. నా ఫ్యామిలీ మెంబెర్స్ ని అడగను. ఆర్ధికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి.. అలాగే నాకు ఇబ్బందులుంటాయి. కాబట్టే పని చెయ్యాలి. కరోనా ఎప్పుడు తగ్గుతుంది అనేది తెలియదు. కాబట్టి దాని కోసం భయపడలేను.. నా ప్రాజెక్ట్స్ నుండి ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు షూటింగ్ రెడీ అవుతాను. లాక్ డౌన్ వలన కార్లు, ఇల్లు కొనలేకపోతున్నామని, అసలా ప్రయత్నాలే చెయ్యలేదని చాలామంది అనుకుంటారు. కానీ నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను. ఇక నా పర్సనల్ విషయాలైనా, కెరీర్ కి సంబందించిన నిర్ణయాలైనా నేనే తీసుకుంటాను తప్ప ఎవరి సలహాలు తీసుకోను అంటుంది శృతి హాసన్.

Shruti Haasan Opens Up On Her Individual Life:

Shruti Hassan is always independent and during the lockdown period too

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ