Advertisementt

స్టాండ‌ప్ రాహుల్‌.. రాజ్ తరుణ్ లుక్

Tue 11th May 2021 04:04 PM
raj tarun,birthday special,stand up rahul movie,stand up rahul poster  స్టాండ‌ప్ రాహుల్‌.. రాజ్ తరుణ్ లుక్
Raj tarun Birthday Poster : Stand Up Rahul స్టాండ‌ప్ రాహుల్‌.. రాజ్ తరుణ్ లుక్
Advertisement
Ads by CJ

రాజ్‌త‌రుణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా స్టాండ‌ప్ రాహుల్‌ చిత్రం నుండి స్పెష‌ల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో రాజ్ త‌రుణ్ హీరోగా డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ మరియు హైఫైవ్ పిక్చర్స్ ప‌తాకాల‌పై నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా  నిర్మిస్తున్న చిత్రం స్టాండ‌ప్ రాహుల్‌. కూర్చుంది చాలు అనేది ట్యాగ్ లైన్‌. ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా సాంటో మోహన్ వీరంకి  ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం అవుతున్నారు.

రాజ్‌త‌రుణ్ కెరీర్‌లోనే ఒక డిఫ‌రెంట్ జోన‌ర్‌లో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం నుండి ఇప్ప‌టికే రిలీజ్ చేసిన ఫ‌స్ట్‌లుక్ అంద‌రి దృష్టిని ఆకర్షించింది. ప్ర‌స్తుతం ఇలాంటి జోన‌ర్ సినిమాల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. దీంతో పాటు టైటిల్ ఆసక్తికరంగా ఉండ‌డం,స్టైలిష్ మేకోవ‌ర్‌లో యూబ‌ర్‌-కూల్‌గా రాజ్‌త‌రుణ్ ఉన్న ఫ‌స్ట్‌లుక్ కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో సినిమాపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి.

ఈ రోజు (మే11) యంగ్ హీరో రాజ్‌త‌రుణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా స్టాండ‌ప్ రాహుల్‌ చిత్రం నుండి మ‌రో స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్‌చేసి శుభాకాంక్ష‌లు తెలిపింది చిత్ర యూనిట్‌. క్రియేటివ్‌గా ఉన్న ఈ పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

Raj tarun Birthday Poster : Stand Up Rahul:

Raj tarun Birthday Special Poster : Stand Up Rahul

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ