Advertisementt

సెకండ్ వేవ్ టైం లో సూపర్ స్టార్ సాహసం

Wed 12th May 2021 10:58 AM
rajinikanth,annaatthe movie,director shiva,covid 19,corona virus second wave,annaatthe movie shooting,hyderabad,ramoji film city  సెకండ్ వేవ్ టైం లో సూపర్ స్టార్ సాహసం
Rajinikanth wraps up Annaatthe; to begin dubbing soon సెకండ్ వేవ్ టైం లో సూపర్ స్టార్ సాహసం
Advertisement
Ads by CJ

కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యాక చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్స్ అంతా సినిమా షూటింగ్స్ ఆపేసి.. సైలెంట్ గా ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం సెకండ్ వేవ్ కరోనాని లెక్క చెయ్యలేదు. శివ దర్శకత్వంలో రజినీకాంత్ నటిస్తున్న అన్నాత్తే షూటింగ్ కోసం ఆయన హైదరాబాద్ కి వచ్చారు. గత ఏడాది డిసెంబర్ లో రజినీకాంత్ ఆరోగ్యం దృష్యా వాయిదా పడిన అన్నాత్తే షూటింగ్ మళ్ళీ రీసెంట్ గా హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది. సెకండ్ వెవ్ స్టార్టింగ్ టైం లోనే అన్నాత్తే షూటింగ్ స్టార్ట్ అయినా రజినీకాంత్ హైదరాబాద్ కి వచ్చేసి అన్నాత్తే షూటింగ్ లో పాల్గొన్నారు. నిన్నటివరకు ఎలాంటి ఆటంకం లేకుండా సూపర్ స్టార్ అన్నాత్తే షూటింగ్ లో పాల్గొని దాన్ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్  చేసేసారు. 

దాదాపుగా 35 రోజులు ఏకధాటిగా షూటింగ్ లో పాల్గొన్న రజినీకాంత్ చెన్నై కి వెళ్లిపోయారు. కీర్తి సురేష్ - నయనతార లాంటి హీరోయిన్స్ తో రజినీకాంత్ సెకండ్ వేవ్ విజృంభించిన టైం లో సాహసం చేసి షూటింగ్ కంప్లీట్ చేసారు. రజినీకాంత్ కి సంబందించిన షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయ్యింది అని, నయనతారతో పాటు ఇతర నటీనటులపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తే అన్నాత్తే షూటింగ్ పూర్తవుతుందట. ఇక రజినీకాంత్ కొన్ని రోజుల రెస్ట్ తర్వాత అన్నాత్తే డబ్బింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలుస్తుంది. ఈ సినిమా తమిళులకు ఎంతో ఇష్టమైన దివాళీ రోజున రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారు.

Rajinikanth wraps up Annaatthe; to begin dubbing soon:

Rajinikanth wraps up Annaatthe Shooting

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ