Advertisementt

అల్లు అర్జున్ సేఫ్

Wed 12th May 2021 11:15 AM
allu arjun,tests,negative,covid-19,allu arjun photos,bunny,corona virus for allu arjun,covid 19,allu arjun negative,allu arjun corona,allu arjun corona negative  అల్లు అర్జున్ సేఫ్
Allu Arjun tests Negative for Covid 19 అల్లు అర్జున్ సేఫ్
Advertisement
Ads by CJ

కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ స్టార్ హీరో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం ఆయన సోషల్ మిడియా ద్వారా అభిమానులకి షేర్ చేసారు. అయితే అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్ వచ్చినా స్వల్ప లక్షణాలతో హోమ్ ఐసోలేషన్ లోనే డాక్టర్స్ ప్రికాషన్స్ తీసుకుంటూ రెస్ట్ తీసుకున్నారు. ఇక ఆయనకి కరోనా రావడంతో ఆయన నటిస్తున్న పుష్ప మూవీ షూటింగ్ వాయిదా పడింది. మధ్యలో అల్లు అర్జున్ తనకి కరోనా లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నాయని, తన ఆరోగ్యం అంతా బాగానే ఉంది అని, ఎవరూ కంగారు పడవద్దు అంటూ హెల్త్ అప్ డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. 

అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్ అని తెలిసిన దగ్గర నుండి ఆయన అభిమానులు.. #GetWellSoonAlluArjun అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా తనకి కరోనా టెస్ట్ చేయించుకోగా.. కరోనా నెగెటివ్ వచ్చింది అని.. అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. తనకి నెగెటివ్ వచ్చింది అని, తాను ఆరోగ్యంగా ఉన్నాను.. తనపై ప్రేమ కురిపించిన వారికి కృతజ్ఞతలు అంటూ హెల్త్ అప్ డేట్ ఇచ్చారు. Hello everyone ! I have tested negative. I am doing well. Thank you all for the love.. అని ట్వీట్ చేసేసరికి ఆయన అభిమానులు శాంతించారు. 

Allu Arjun tests Negative for Covid 19:

Allu Arjun tests negative for Covid-19, urges everyone to be safe

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ