తెలంగాణాలో లాక్ డౌన్ పెట్టేసారు. ఈ రోజు నుండే లాక్ డౌన్ ఓ పది రోజుల పాటు అమలులో ఉండబోతుంది. అయితే తెలంగాణ ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం సినిమా షూటింగ్స్ కి అనుమతులు ఉన్నట్టా? లేనట్టా? ప్రస్తుతం సెట్స్ మీదున్న చాలా సినిమాల షూటింగ్ లు సెకండ్ వేవ్ ఎంటర్ కాగానే ఆగిపోయాయి. అఖండ, పుష్ప, ఆదిపురుష్, సలార్, నిన్నటివరకు రజినీకాంత్ అన్నత్తే షూటింగ్ ఇవన్నీ జరిగాయి. అల్లు అర్జున్ కి కరోనా రావడంతో పుష్ప షూటింగ్ కూడా ఆగింది కానీ అఖండ, ఆదిపురుష్, నానికి శ్యామ్ సిగ్రాయ్ లాంటి షూటింగ్స్ ఇంకా జరుగుతున్నాయి. మరి లాక్ డౌన్ లో ఈ షూటింగ్స్ ఆపాలా? లేదంటే పరిమిత సంఖ్యలో చేసుకోవచ్చా?
మరోపక్క సీరియల్స్ షూటింగ్స్, అలాగే జబర్దస్త్, ఢీ డాన్స్, స్టార్ట్ మ్యూజిక్, స్టార్ట్ మా కామెడీ షోస్ శ్రీదేవి డ్రామా కంపెనీ, లాంటి షోస్ పరిస్థితి ఏమిటి? అంటే ఇవన్నీ ఈ లాక్ డౌన్ తో ఆగిపోవాలా.. లేదంటే చేసుకోవచ్చా. అసలు ఆయా షూటింగ్స్ జరుగుతున్న అప్ డేట్స్ కూడా లేవు. మరి ఈ పది రోజుల షూటింగ్స్ విషయాలు ఇంకా ప్రేక్షకులకి క్లారిటీ రావడం లేదు. గత లాక్ డౌన్ లో సినిమా షూటింగ్స్ దగ్గర నుండి.. సీరియల్స్, స్పెషల్ షోస్ షూటింగ్స్ అన్ని మూడు నాలుగు నెలల పాటు ఆపేసారు. మరి ఇప్పుడే షూటింగ్స్ పరిస్థితి ఏమిటనే ప్రశ్న రేజ్ అయ్యింది.