కన్నడ లో నటించిన మొదటి సినిమా హీరో ని ప్రేమించేసి పెళ్ళికి సిద్దపడిపోయి.. అతనితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న రష్మిక మందన్న ఆ తర్వాత టాలీవుడ్ లో క్లిక్ అవడంతో ఆ ఎంగేజ్మెంట్ ని, లవ్ ని బ్రేక్ చేసుకుని టాప్ హీరోయిన్ గా టాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. కొన్నాళ్లుగా చేతినిండా సినిమాలతో టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు దున్నేస్తున్న రష్మిక ఇప్పుడు పెళ్లి విషయంలో మాములుగా ట్విస్ట్ ఇవ్వలేదు. ప్రెజెంట్ సింగిల్ గా ఉన్న రష్మిక పాన్ ఇండియా మూవీ, బాలీవుడ్ మూవీస్ తో అదరగొట్టేస్తుంది. విజయ్ దేవరకొండ తో స్నేహంగా సన్నిహితంగా ఉండడంతో విజయ్ - రష్మిక జంటపై రూమర్స్ కూడా చక్కర్లుకు కొడుతున్నాయి.
అయితే రష్మిక మాత్రం అటు కన్నడ కాదు, ఇటు తెలుగు కాకుండా తమిళ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నట్లుగా చెప్పి అందరికి షాకిచ్చింది. కార్తితో ఈమధ్యనే సుల్తాన్ మూవీలో నటించిన రశ్మికకి ఆ సినిమాలో లుక్స్ పరంగా విమర్శలు ఎదుర్కొంది. అయితే తమిళంలో ఇంకా బిజీ కానీ రష్మిక కి తమిళ సాంప్రదాయాలన్నా, తమిళ సంస్కృతి తనను ఎంతో ఆకర్షించాయని.. అంతేకాకుండా. తమిళనాడు వంటలు చాలా రుచికరంగా ఉన్నాయని.. అవన్నీ తనకి ఎంతో నచ్చాయని.. అందుకే ఎప్పటికైనా తమిళ ఇంటి కే కోడలిని అవుతానని, తమిళ వ్యక్తిని పెళ్లికి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుతా అంటూ చెప్పి షాకిచ్చింది.