Advertisementt

మెగా గుసగుస: లూసిఫర్ డైరెక్టర్ చేంజ్

Thu 13th May 2021 01:43 PM
chiranjeevi,lucifer,mohan raja,lucifer story,telugu movie lovers,telugu nativity  మెగా గుసగుస: లూసిఫర్ డైరెక్టర్ చేంజ్
Lucifer remake director to be changed? మెగా గుసగుస: లూసిఫర్ డైరెక్టర్ చేంజ్
Advertisement
Ads by CJ

చిరంజీవి వరస సినిమాలతో మెగా ఫాన్స్ కి ఊపిరాడని సంతోషాన్ని ఇస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమా సెట్స్ మీదుండడమే కాకుండా చిరుకి ఎంతో ఇష్టమైన మలయాళ రీమేక్ లూసిఫర్ ని కూడా సెట్స్ మీదకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత వేదాళం రీమేక్, బాబీ సినిమాలు ఉండనే ఉన్నాయి. ఆచార్య షూటింగ్ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వలన ఆగిపోయిన విషయం తెలిసిందే,. కొరటాల శివ ఆచార్య షూటింగ్ కి బ్రేక్ పడడంతో NTR30 కోసం స్రిప్ట్ ప్రిపరేషన్ లో బిజీగా వున్నాడు. అయితే చిరంజీవి లూసిఫర్ మూవీ పట్టాలెక్కేముందే పలువురు దర్శకులు మారిన విషయం తెల్సిందే. అందులో ముందుగా సాహో సుజిత్ దర్శకుడిగా లూసిఫర్ రీమేక్ పట్టాలెక్కల్సింది.. ఆయన స్థానంలోకి వినాయక్ వచ్చాడు.

తర్వాత వినాయక్ ప్లేస్ లోకి తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ తెలుగు స్రిప్ట్ ని పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు లూసిఫర్ కి అఫీషియల్ గా మారిన డైరెక్టర్ మోహన్ రాజా కూడా ఈ సినిమా నుండి తప్పుకున్నాడనే గుసగుసలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తెలుగు నేటివిటీకి దగ్గరగా మోహన్ రాజా లూసిఫర్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసి మెగాస్టార్ తో ఓకె చేయించుకున్నాక.. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయ్యాక ఇప్పడు లూసిఫర్ రీమేక్ ఆగిపోవడం అంటే.. డైరెక్టర్ ని తప్పించడం అనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో స్ప్రెడ్ అయ్యింది. మరి మోహన్ రాజా నిజంగా తప్పుకున్నాడా? తప్పించారా? ఇందులో నిజమెంత అనేది మెగా కాంపౌండ్ స్పందిస్తేనే కానీ తెలియదు.

Lucifer remake director to be changed?:

Shocking rumours about Lucifer Remake