Advertisementt

మహానటి అలాంటి పాత్రలో

Thu 13th May 2021 09:15 PM
keerthy suresh,mahesh babu,keerthy role in sarkaru vaari paata,sarkaru vaari paata movie,sarkaru vaari paata shooting,mahesh - keerthy suresh  మహానటి అలాంటి పాత్రలో
Keerthy Suresh role Revealed in Mahesh Sarkaru Vaari Paata మహానటి అలాంటి పాత్రలో
Advertisement
Ads by CJ

మహానటి కీర్తి సురేష్ ఆ సినిమా తర్వాత చాలా సినిమాల్లో అసలు ప్రధాన్యతలేని పాత్రలు పోషించింది. మహానటి కన్నా ముందు పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసిలో అర్ధం పర్ధం లేని కేరెక్టర్ లో చిరాకు తెప్పించింది. తర్వాత తమిళంలో సర్కార్, స్వామి 2 లో కనిపించింది. ఈ సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక తర్వాత పెంగ్విన్, మిస్ ఇండియా, తాజాగా గుడ్ లక్ సఖి. పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు డిజాస్టర్. గుడ్ లాక్ సఖిలో కీర్తి కేరెక్టర్ చూస్తే సినిమాపై క్రేజ్ పెరుగుతుంది. అయితే  ఆ సినిమాల తర్వాత కీర్తి సురేష్ చేసిన రంగ్ దే మూవీలో కీర్తి రోల్ అందరిని మెప్పించింది.

ఆ తర్వాత మహేష్ బాబు తో సర్కారు వారి పాటలో నటిస్తుంది. కీర్తి సురేష్ బరువు తగ్గాక ఆమె లుక్స్ పై పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. ఇక సర్కారు ఆవిరి పాటలో కీర్తి సురేష్ లుక్ పై మహేష్ ఫాన్స్ లో ఇంకా సందేహం తొలగలేదు. అయితే ఇప్పుడు కీర్తి సురేష్ సర్కారువారి పాటలో ఎలాంటి రోల్ ప్లే చేస్తుందో అంటూ ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సర్కారు వారి పాట సినిమా మొత్తం బ్యాంకింగ్ రంగంలో జరిగిన అవకతవల నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మహేష్ బ్యాంకులని ని మోసం చేసే వారి పని పట్టే కుర్రాడిగా కనిపించబోతున్నాడు. 

అయితే కీర్తి సురేష్ పాత్ర ఈ సినిమాలో హైలెట్ గా ఉంటుందట. అంతేకాదు స్క్రీన్ టైం కూడా ఎక్కువగా ఉంటుందట. కీర్తి సురేష్ ఈ సినిమాలో మహేష్ బాబుకు సబార్డినేట్ గా కనిపిస్తుందని అంటున్నారు. మరి ఈసారి కీర్తి సర్కారు వారి పాటతో జాక్ పాట్ కొట్టేట్టుగా కనిపిస్తుంది.

Keerthy Suresh role Revealed in Mahesh Sarkaru Vaari Paata:

Keerthy Suresh role in Sarkaru Vaari Paata revealed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ