అక్కినేని నాగ చైతన్య లేటెస్ట్ చిత్రం లవ్ స్టోరీ రిలీజ్ కరోనా సెకండ్ వేవ్ వలన పోస్ట్ పోన్ అయ్యింది. ఆ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సాయి పల్లవి నటన, డాన్స్, నాగ చైతన్య పెరఫార్మెన్స్, శేఖర్ కమ్ముల దర్శకత్వం ఇవన్నీ సినిమాని అదనపు ఆకర్షణలుగా ఉన్నాయి. ఇక చైతు నెక్స్ట్ మూవీ విక్రమ్ కుమర్ దర్శకత్వంలో చేస్తున్న థాంక్యూ. ఆ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే. హైదరాబాద్ లో జరిగే చిన్నపాటి చివరి షెడ్యూల్ తో ఆ సినిమా షూటింగ్ పూర్తయిపోతుంది. ఈ రెండు మూవీ తర్వాత చైతూ మరో బాలీవుడ్ మూవీ చేస్తున్నాడు.
అది అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా లో నాగ చైతన్య ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. లాల్ సింగ్ చద్దా అమీర్ ఖాన్ లుక్ కి అందరూ ఇంప్రెస్స్ అయ్యారు. ఇక నాగ చైతన్య థాంక్యూ షూటింగ్ కంప్లీట్ కాగానే ముంబైగా వెళ్ళిపోతాడట. లాల్ సింగ్ చద్దా లో గతంలో విజయ్ సేతుపతి నటించాలనుకున్న కేరెక్టర్ లో ఇప్పుడు చైతు నటిస్తున్నాడు. ఇక ఆ సినిమా కోసం లుక్ మార్చే ప్రయత్నాల్లో చైతూ ఉన్నాడట. లాల్ సింగ్ చద్దా లద్దాఖ్, కార్గిల్ ప్రాంతాల్లో ఆఖరి షెడ్యూల్‌ని ప్రారంభించనున్నారు. ఓ 15 రోజుల షూటింగ్ కోసం నాగ చైతన్య లుక్ పూర్తిగా చేంజ్ చేయబోతున్నాడట. ఇప్పటికే దానికి సంబందించిన కసరత్తులు కూడా మొదలయ్యాయట. ఈ లాల్ సింగ్ చద్దా లో నాగ చైతన్య మేకోవర్ మాములుగా ఉండదని.. లాల్ సింగ్ చద్దా ఆఖరి షెడ్యూల్ చైతూ పాల్గొంటాడని తెలుస్తుంది.