కరోనా వ్యాప్తి కారణంగా విద్యార్థుల క్షేమం దృష్యా ఇప్పటికే CBSC 10th, 11th పరీక్షలు లేకుండా విద్యార్థులని పాస్ చేసిన విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా ఉన్న కారణమగానే CBSC బోర్డు పరీక్షలని రద్దు చేసింది. అయితే 12th ఎగ్జామ్స్ ని మాత్రం వాయిదా వేశారు. పరిస్థితులు చక్కబడితే పరీక్షలు పెడదామని చూసారు. అలాగే తెలంగాణలోనూ 10 విద్యార్థులని పరీక్షలు రద్దుచేసి ప్రమోట్ చేసింది ప్రభుత్వం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులని సెకండ్ ఇయర్ కి ప్రమోట్ చేసేలా పరీక్షలను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం సెకండ్ ఇయర్ పరీక్షలను మాత్రం పోస్ట్ పోన్ చేసింది.
అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విపరీతంగా ఉన్న కారణంగా అటు CBSC బోర్డు, ఇటు తెలంగాణ ఇంటర్ బోర్డు కూడా 12th, ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలని రద్దు చేసే అవకాశం కనిపిస్తుంది. కరోనా ఉధృతి తగ్గేలా లేదు, ఇలాంటి టైం లో పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థుల ప్రాణానికే ప్రమాదం అని జూన్ ఫస్ట్ వీక్ లో ఎగ్జామ్స్ పై CBSC బోర్డు, తెలంగాణ ఇంటర్ బోర్డ్ చర్చించి 12th, ఇంటర్ పరీక్షల రద్దు నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం, చాలా రాష్ట్రాలు లాక్ డౌన్, కర్ఫ్యూలతో కరోనా కట్టడిలో తలమునకలై ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలు పరీక్షల రద్దు నిర్ణయానికే మొగ్గు చూపుతున్నాయి.