Advertisementt

వయసుతో పాటే శరీరాకృతి అంటున్న ప్రియాంక

Fri 14th May 2021 06:42 PM
priyanka chopra,dealing with age and its impact,body  వయసుతో పాటే శరీరాకృతి అంటున్న ప్రియాంక
Priyanka speaks of physique with age వయసుతో పాటే శరీరాకృతి అంటున్న ప్రియాంక
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా - దీపికా పదుకొనేలా మధ్యన టాప్ చైర్ వార్ ఓ రేంజ్ లో నడిచింది. వాళ్ళ మధ్యన వార్ ఎలా ఉన్నా ఈ ఇద్దరు హీరోయిన్స్ కొంచెం అటు ఇటుగా ఒకేసారి పెళ్లిళ్లు చేసుకుని పర్సనల్ లైఫ్ లో సెటిల్ అయ్యారు. దీపికా రన్వీర్ సింగ్ ని పెళ్లాడింది. ప్రియాంక అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ ని పెళ్లి చేసుకుని అమెరికా చెక్కేసి హాలీవుడ్ కే పరిమితమైంది. దానితో దీపికా బాలీవుడ్ నెంబర్ వన్ ప్లేస్ ని ఎంజాయ్ చేస్తుంది. అయితే ప్రియాంక చోప్రా తనకన్నా చిన్నవాడైన జోనస్ ని పెళ్లి చేసుకోవడం అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయ్యింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ప్రియాంక చోప్రా వయసుతో పాటుగా అందం తరిగిపోతుంది అనే లాజిక్ ని ఒప్పేసుకుంది. ప్రియాంక శరీరాకృతిపై నెటిజెన్స్ ట్రోల్స్ కి ప్రియాంక పర్ఫెక్ట్ సమాధానం ఇచ్చింది. ఏజ్ తో పాటుగా వచ్చే శారీరక మార్పులని తాను స్వీకరించేందుకు మానసికంగా సిద్ధంగా ఉన్నా అని, ప్రస్తుతం వయసుతో వచ్చే శారీరక ఇబ్బందులు నేను పడడం లేదని అబద్దం చెప్పను అని, అందరిలాగే వయసుతో పాటుగా తన శరీరం మార్పు చెందుతుంది అని, ప్రియాంక చోప్రా ఆ నెటిజెన్స్ కి కుండబద్దలు కొట్టింది. మరి నిజంగానే హీరోయిన్స్ అయితే వయసు రాదా? వాళ్ళు ముసలివాళ్ళు అవరా? ఎప్పటికి గ్లామర్ గానే ఉంటారా? ప్రియాంక చెప్పేది నిజమే. మన శరీరంలో వచ్చే మార్పులని స్వీకరించడం మన బాధ్యత అంతే.

Priyanka speaks of physique with age:

Priyanka Chopra On How She Is Dealing With Age And Its Impact On Her Body

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ