కమల్ హాసన్ - శంకర్ కాంబోలో లైకా ప్రొడక్షన్ భారీ బడ్జెట్ తో ఇండియన్ 2 మూవీని మొదలు పెట్టడం షూటింగ్ చాలా వరకు పూర్తయ్యాక క్రైన్ ఆక్సిడెంట్ జరగడం, అందులో శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్స్ చనిపోవడంతో శంకర్ ఇండియన్ 2 షూటింగ్ ఆపేసారు. అప్పటినుండి లైకా ప్రొడెక్షన్ కి శంకర్ కి మధ్యన పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. కమల్ హాసన్ ఇద్దరికి మధ్యన సయోధ్య కుదర్చాలనుకున్నా కుదరడం లేదు. ఇక శంకర్ ఇండియన్ 2 విషయాన్నీ పక్కనబెట్టి రామ్ చరణ్ తో పాన్ ఇండియా మూవీ, రన్వీర్ సింగ్ తో అపరిచితుడు రీమేక్ మూవీలను అనౌన్స్ చేసాడు. దానితో లైకా ప్రొడక్షన్స్ వారు శంకర్ ని ఎలాగైనా వేరే మూవీస్ చెయ్యకుండా ఆపాలని కోర్టు కెళ్ళింది. కోర్టు కూడా ఇండియన్ 2 చేశాకే శంకర్ ని బయటికి వెళ్ళమని చెప్పడం, ఇద్దరూ కూర్చుని మట్లాడుకుని సరి చేకోమని చెప్పింది.
అయితే ఇండియన్ 2 షూటింగ్ మొదలు పెట్టే ఆలోచనలో శంకర్ ఉన్నారు. కమల్ కూడా డేట్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. అయితే ఈలోపు లైకా ప్రొడక్షన్స్ వారు శంకర్ పై మరో చర్యకి రెడీ అయ్యారు. అంటే ఇండియన్ 2ని పూర్తి చేసే వరకు శంకర్ కొత్త చిత్రం మొదలుపెట్టకుండా చూడాలని తెలుగు, హిందీ ఫిల్మ్‌ఛాంబర్స్‌కు లేఖ రాసినట్టు తెలుస్తోంది. శంకర్ రామ్ చరణ్ తో మూవీ మొదలు పెట్టకుండా, అటు రన్వీర్ తో మూవీ చెయ్యకుండా తమ సినిమా అయ్యేవరకు శంకర్ తో సినిమాలు చెయ్యొద్దు అని లేఖ రాసింది అంటే.. లైకా ప్రొడక్షన్ అసలు ఇండియన్ 2 మూవీ షూటింగ్ ని ఫినిష్ చేసే ఉద్దేశ్యం ఉందో.. లేదో.. కానీ..శంకర్ పై లైకా ప్రొడక్షన్స్ ఆంక్షలు విధించి మధ్యలో శంకర్ ని ఇబ్బంది పెట్టడమే వారి ముందున్న లక్ష్యంలా మారింది. మరి ఈ లెక్కన రామ్ చరణ్ - శంకర్ కాంబో మూవీ ఇప్పుడప్పుడే మొదలయ్యే సూచనలు లేవు.