రవితేజ ఈ ఏడాది ఆరంభంలోనే క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. రవితేజ - గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కిన క్రాక్ మూవీ కి లాక్ డౌన్ టైం లో ఓటిటి ఆఫర్స్ వచ్చినా మైత్రి మూవీస్ మేకర్స్ వాళ్ళు ఆ సినిమాని ఓటీటీకి ఇవ్వకుండా థియేటర్స్ లోనే విడుదల చేస్తామని ఉంచేశారు. అయితే వాళ్ళ నమ్మకం వమ్ము కాలేదు. రవితేజ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ గా క్రాక్ నిలిచింది. థియేటర్స్ లో క్రాక్ మాస్ హిట్ అయ్యింది. ఇక రవితేజ లేటెస్ట్ మూవీ ఖిలాడీ విషయంలోనూ ఇప్పుడదే జరుగుతుంది. రవితేజ - రమేష్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న ఖిలాడీ మూవీ ఈ నెల 28 న విడుదలకు డేట్ ఫిక్స్ చేసినా సెకండ్ వేవ్ కారణంగా ఖిలాడీ రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది. అయితే అప్పటినుండి రవితేజ ఖిలాడీ మూవీకి ఓటిటి ఆఫర్స్ వస్తున్నాయి.
కానీ ఖిలాడీ టీం ఈ విషయమై స్పందించలేదు. రీసెంట్ గా ఖిలాడీ మూవీ భారీ ధరకు ఓటిటికి అమ్ముడు పోయింది. అది కూడా అమెజాన్ ప్రైమ్ వారు ఖిలాడీ మూవీని కొనేశారు.. భారీ డీల్ వచ్చేసరికి మేకర్స్ ఖిలాడీని వదిలించుకున్నారనే కాదు.. ఏకంగా అమెజాన్ ప్రైమ్ లో పలానా డేట్ కి ఖిలాడీ మూవీ రిలీజ్ అంటూ వార్తలొస్తున్నాయి. దానితో మేకర్స్ మేలుకుని మా సినిమా ఎట్టిపరిస్తితుల్లోనూ థియేటర్స్ లోనే విడుదల చేస్తామంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసారు. రవితేజ ఖిలాడీ కేవలం థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుంది. ఆ తర్వాతే ఓటిటి అని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా త్వరలోనే రిలీజ్ డేట్ ఇస్తామంటూ ట్వీట్ చేసారు. ఇక దీనితో ఖిలాడీ ఓటిటి రిలీజ్ న్యూస్ లకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే.