ఈమాటన్నది ఏ కమెడియానో కాదు హీరోయిన్ పూజ హెగ్డే. నిజంగానే హీరోయిన్స్ కామెడీ చేస్తే.. బావుంటుంది. కానీ వాళ్ళ కామెడీ ప్రేక్షకులు చూడాలిగా. ప్రస్తుతం కరోనా నుండి కోలుకున్న పూజ హెగ్డే అఖిల్ తో చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బాచ్‌లర్ గురించి మాట్లాడింది. ఈ సినిమాలో పూజ హెగ్డే స్టాండప్ కామెడీ చేసే అమ్మాయిగా నటించింది. పూజ గ్లామర్ తో అఖిల్ కి ఈసారి హిట్ పక్కా అనేలా పూజ హెగ్డే మోస్ట్ ఎలిజిబుల్ బాచ్‌లర్ లుక్స్ ఉన్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా పాత్ర చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతుంది అనేది సాంగ్స్ లోను, టీజర్ లోను చూసాం.
అయితే స్టాండప్ కామెడీ ఈజీ అనుకున్నా.. అది చేస్తేగానీ తెలీదు ఎంత కష్టంగా ఉంటుందో.. అంటుంది పూజ హెగ్డే. తాను ఇప్పటివరకు చేసిన పాత్రలు ఒక ఎత్తు.. ఈ స్టాండప్ కామెడీ పాత్ర ఒక ఎత్తు.. దీని కోసం చాలా కష్టపడ్డాను అని చెబుతుంది పూజ హెగ్డే. కామెడీతోనే కాదు.. పంచ్ డైలాగులతో ఆకట్టుకోవాలి..ఎంత అవసరమో అంతే స్టాండప్ కామెడి స్కిల్స్ చూపించాలి. దానికోసం కష్టపడడం అటుంచి చాలా హోం వర్క్ చేయాల్సి వచ్చిందని చెబుతుంది. ఇక పూజ హెగ్డే ప్రస్తుతం ఈ సినిమాతో పాటుగా రామ్ చరణ్ సరసన ఆచార్య మూవీ, అలాగే ప్రభాస్ తో పాన్ ఇండియా ఫిలిం రాధేశ్యామ్ లోనూ నటిస్తుంది. ఇక తమిళ్ లో విజయ్ తో, బాలీవుడ్ బడా ప్రాజెక్ట్స్ లో పూజ కి క్షణం తీరిక లేని షూటింగ్స్ తో బిజీ గా మారింది.