ప్రస్తుత పరిస్థితుల్లో అనుకున్న డేట్స్ కి ఎన్ని సినిమాలు విడుదలవుతాయో అనేది చెప్పడానికి చాలా కష్టం. సెకండ్ వేవ్ ఎప్పుడు తగ్గుతుంది.. మళ్ళీ ఎప్పుడు పరిస్థితులు చక్కబడతాయి అనేది ఎవ్వరూ చెప్పలేని స్థితిలో ఇండియా ఉంది. అన్ని దేశాల్లో కరోనా కంట్రోల్ లో ఉన్నా ఇండియా లో మాత్రం కరోనా అదుపుతప్పింది. సెకండ్ వేవ్ లో వేలల్లో ప్రాణాలు పోతున్నాయి. ఇలాంటి టైం లో షూటింగ్స్ అనుకున్నట్టుగా జరగడం అసాధ్యం. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ కూడా అక్టోబర్ 13 న రిలీజ్ అవుతుంది అంటే కష్టమనే మాటే వినిపిస్తుంది.
మరి ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాలతోను, రామ్ చరణ్ శంకర్ తోనూ సినిమాలను కమిట్ చేసి ఉంచారు. రెండూ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్. కొరటాల ఆచార్య అయిపోతే ఫ్రీ.. దానితో ఎన్టీఆర్ ఆర్ ఆర్. ఆర్ తర్వాత కొరటాల షూటింగ్ కి వెళ్ళిపోతాడు కానీ.. చరణ్ మాత్రం భారీ గ్యాప్ తీసుకునేలా ఉంది శంకర్ వ్యవహారం.
శంకర్ తో దిల్ రాజు భారీ బడ్జెట్ మూవీ సెట్ చేసుకుని రామ్ చరణ్ ని ఒప్పించి జూన్ నుండో, జులై నుండో షూటింగ్ మొదలెట్టే ఏర్పాట్లలో ఉండగా.. శంకర్ కి ఇండియన్ 2 వ్యవహారం మెడకి చుట్టుకుంది. లైకా వారు కోర్టుకెళ్లి శంకర్ మీద కక్ష సాధిస్తున్నారు. శంకర్ దారికొచ్చినా లైకా ఆయన్ని వదలడం లేదు. తెలుగులో రామ్ చరణ్ తో, హిందీలో రన్వీర్ తో శంకర్ చెయ్యబోయే చిత్రాలను ఇండియన్ 2 అయ్యేవరకు అనుమతించవద్దు అంటూ తెలుగు, హిందీ ఫిలిం చాంబర్స్ కి లేఖలు రాసే పనిలో ఉంది. అంటే ఇండియన్ 2 పూర్తయ్యి విడుదలయ్యేవరకు శంకర్ తన తదుపరి ప్రాజెక్ట్స్ జోలికి వెళ్ళకూడదు . అలా రామ్ చరణ్- శంకర్ మూవీ లేట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఆర్.ఆర్.ఆర్ తర్వాత రామ్ చరణ్ కి భారీ గ్యాప్ తప్పదు అనేది.