టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ మొదటిసారి డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టి పాన్ ఇండియా లెవల్లో చేసిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ కోసం తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులనంత వెయిటింగ్. ఈ వెబ్ సీరీస్ అమెజాన్ లో ఎప్పుడు ప్లే అవుతుందా అని అందరూ ఆత్రంగా ఎదురు చూస్తుంటే.. అది మాత్రం వెనక్కి పోతుంది. త్వరలోనే ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్ రిలీజ్ తో పాటు రిలీజ్ డేట్ అనౌన్సమెంట్ అంటున్నారు. అయితే తెలుగు ప్రేక్షకుల్లో ఫ్యామిలీ మ్యాన్ సీరీస్ పై అంత ఆత్రుత ఎందుకంటే గ్లామర్ హీరోయిన్ సమంత నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ చేసింది.. ఓ టెర్రరిస్ట్ గా సమంత ఈ సీరీస్ లో కనిపించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.
అయితే తాజాగా సినిమాబండి ప్రమోషన్స్ లో భాగంగా ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే లు ఇస్తున్న ఇంటర్వూస్ లో సమంత ఫ్యామిలీ మ్యాన్ లో నటించిన విషయాలను మీడియా తో ముచ్చటించారు. ఈ సీరీస్ లోకి సమంత ని తీసుకోవడానికి ఓ ప్రత్యేక కారణం ఉందని.. ఆమె పాత్రలో రకరకాల షేడ్స్ ఉంటాయని, అయితే ఆమెది విలన్ పాత్ర అని చెప్పలేము కానీ మనోజ్ బాజ్ పాయ్ కి అపోజిట్ కేరెక్టర్ సమంత ది అనే షాకింగ్ ట్విస్ట్ రివీల్ చేసారు. మనోజ్ బాజ్ పాయ్ ఓ రా ఏజెంట్. అలాంటిది ఆయనకి అపోజిట్ కేరెక్టర్ అంటే.. నెగెటివ్ కేరెక్టర్.. మరి రాజ్, డీకే లు అది విలన్ పాత్ర కాదంటూ సస్పెన్స్ లో పెట్టారు.
మరి సమంత పాత్రపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలుంటే. ఇప్పుడు వీరి మాటలతో ఆ అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. అందులోనూ ఈ సీరీస్ కోసం సమంత ఫస్ట్ టైం హిందీలో డబ్బింగ్ కూడా చెప్పుకుంది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేసి జూన్ లో ఈ ఫ్యామిలీ మ్యాన్ 2 ని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్లుగా చెప్పారు కానీ.. డేట్ మాత్రం ఇవ్వలేదు.