Advertisementt

పుష్ప లో ఇద్దరు విలన్స్

Sun 16th May 2021 09:52 PM
pushpa pan india movie,fahadh faasil,villain role,allu arjun pushpa  పుష్ప లో ఇద్దరు విలన్స్
2 Villain Role in Pushpa movie పుష్ప లో ఇద్దరు విలన్స్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా రెండు పార్టులుగా విడుదలవుతుంది అని పుష్ప.. వన్ అఫ్ ద ప్రొడ్యూసర్ చెప్పినప్పటినుండి సినిమాపై అంచనాలతో పాటు అనుమాలు, గాసిప్స్ కూడా ఎక్కువయ్యాయి. అల్లు అర్జున్ పాత్ర పుష్ప రాజ్ కి విలన్ గా మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ని ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే ఫహద్ ఫాజిల్ పై కొన్ని సీన్స్ కూడా సన్నివేశాలను చిత్రీకరించారు సుకుమార్. అల్లు అర్జున్ కి కరోనా రావడం, సెకండ్ ఉధృతి తో పుష్ప మూవీ షూటింగ్ వాయిదా పడింది.

అయితే ఇప్పుడు పుష్ప రెండు పార్ట్ లుగా విడులవుతుంది.. కాబట్టి ఈ సినిమాలో ఇద్దరు విలన్స్ ఉండబోతున్నారు.. ఫహద్ ఫాజిల్ రోల్ ఫస్ట్ పార్ట్ 1 లో అంతమైపోతుంది.. సెకండ్ పార్ట్ లో మరో విలన్ ఉంటాడు అంటూ సోషల్ మీడియా టాక్. ఫహద్ ఫాజిల్ కాకుండా మరో పవర్ ఫుల్ విలన్ రోల్ ని సుకుమార్ డిజైన్ చేసుకున్నారట. రెండు పార్ట్ లకి కలిపి 4.30 గంటల స్క్రీన్ ప్లే సుకుమార్ దగ్గర ఉందట. అందుకే ధైర్యం చేసి పుష్ప ని రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయబోతున్నారట. పార్ట్ వన్ రిలీజ్ కి పార్ట్ 2 రిలీజ్ కి ఆరు నెలలు గ్యాప్ ఉండేలా ప్లాన్ చేసుకుంటుందట టీం.

2 Villain Role in Pushpa movie:

Fahadh Faasil to play the villain in Allu Arjun Pushpa 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ