1987 మే 17న హైదాబాద్‌కు చెందిన పంజాబీ ఫ్యామిలీలో జన్మించిన ఛార్మి కౌర్.. నీ తోడు కావాలి సినిమా తో హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్ అగ్రహీరోలైన ఎన్టీఆర్, ప్రభాస్, నాగార్జున, నితిన్ లతో నటించింది. తర్వాత జ్యోతి లక్ష్మి, మంత్ర వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేసిన ఛార్మి.. హీరోయిన్ గా అవకాశాలు తగ్గాక పూరి జగన్నాధ్ తో కలిసి పీసీ కనెక్ట్స్ పేరుతొ ప్రొడక్షన్ హౌస్ స్థాపించి అందులో పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించే సినిమాలని పూరి తో కలిసి నిర్మిస్తుంది ఛార్మి కౌర్. సక్సెస్ ఫుల్ నిర్మాతగా ఇస్మార్ట్ శంకర్ తో భారీ హిట్ అందుకున్న ఛార్మి ప్రెజెంట్ లైగర్ లాంటి పాన్ ఇండియా మూవీ ని కరణ్ జోహార్, పూరి జగన్నాధ్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తుంది.
హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ మీద కనిపించకపోయినా.. ఛార్మి మాత్రం పూర్తి ఫిట్ నెస్ తో గ్లామర్ ని పర్ఫెక్ట్ గా మెయింటింగ్ చేస్తుంది.
ఇక చాలావరకు చిత్రీకరణ పూర్తయిన లైగర్ మూవీ కోసం ముంబై లో ఛార్మి - పూరి లు ఓ ఆఫీస్ కూడా తెరిచారు. లైగర్ మూవీ షూటింగ్ ఎక్కువగా ముంబై లోనే జరుగుతుండడంతో.. ఛార్మి ముంబై లోనే ఉండి లైగర్ లొకేషన్స్ లోనే సందడి చేస్తుంది. ఎంతో ఇష్టపడి పెంచుకుంటున్న పెంచుకుంటున్న పెట్స్ తో ఛార్మి చేసే అల్లరి వీడియోస్ ని, ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసే ఛార్మి మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో, జనతా కర్ఫ్యూ పెట్టినందువలన లైగర్ షూటింగ్ వాయిదా పడడంతో...ఛార్మి హైదరాబాద్ కి వచ్చేసింది. నేడు ఛార్మి పుట్టిన రోజు.. సక్సెస్ ఫుల్ నిర్మాత ఛార్మికి సినీ జోష్ టీం తరుపున నుండి ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.