Advertisementt

పూర్తిగా సైడ్ అయిన శేఖర్ మాస్టర్

Mon 17th May 2021 08:25 PM
dhee judge,sekhar master,star celebrity,dance show,dhee dance show  పూర్తిగా సైడ్ అయిన శేఖర్ మాస్టర్
Why did Sekhar master leave Dhee show పూర్తిగా సైడ్ అయిన శేఖర్ మాస్టర్
Advertisement
Ads by CJ

ఈ టివి ఢీ డాన్స్ షో ద్వారా బాగా హైలెట్ అయిన డాన్స్ మాస్టర్స్ లో శేఖర్ మాస్టర్ ఒకరు.. ఢీ టైటిల్ కొట్టే రేసులో రెండుసార్లు ఓడిపోయినా శేఖర్ మాస్టర్ ఆ తర్వాత స్టార్ కొరియోగ్రాఫేర్ అయ్యారు. చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ కి కొరియోగ్రాఫేర్ గా సెలెబ్రిటీ హోదాని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తనకి ఏ డాన్స్ షో అయితే పేరు తెచ్చిందో అదే డాన్స్ షో కి శేఖర్ మాస్టర్ వన్ అఫ్ ద జేడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఢీ డాన్స్ షో చాలా సీజన్స్ నుండి శేఖర్ మాస్టర్ - పూర్ణ - ప్రియమణి లు కలిసి జేడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు అప్పుడప్పుడు శేఖర్ మాస్టర్ జబర్దస్త్ జేడ్జ్ గాను, అలాగే ఈ టివి ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ కి రోజా తో పాటుగా సెక్కర్ మాస్టర్ కూడా జేడ్జ్ గా సందడి చేసేవారు.

అయితే కొన్నాళ్లుగా ఢీ జేడ్జ్ ప్లేస్ లో శేఖర్ మాస్టర్ కనిపించడం లేదు. ఆయన స్థానంలో ఏ రాకేష్ మాస్టారో, ఏ గణేష్ మాస్టారో కనిపిస్తున్నారు. ప్రియమణి, పూర్ణ పక్కన ఈ మధ్యన తరుచూ గణేష్ మాస్టర్ ఢీ కింగ్ అండ్ క్వీన్స్ జేడ్జ్ ప్లేస్ లో ఉంటున్నారు. శేఖర్ మాస్టర్ మాత్రం కనిపించడం లేదు. అయితే శేఖర్ మాస్టర్ ఎమన్నా షూటింగ్స్ తో బిజినా అంటే అదీ లేదు. ఎందుకంటే శేఖర్ మాస్టర్ స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ షో లో జేడ్జ్ ప్లేస్ లో కనిపిస్తున్నారు. మరో జేడ్జ్ శ్రీదేవి తో కలిసి స్టార్ మా కామెడీ షో స్టేజ్ మీద డాన్స్ చేస్తున్నారు. కానీ ఢీ డాన్స్ షోలో మాత్రం శేఖర్ మాస్టర్ కనిపించడం లేదు. అంటే కావాలనే తప్పుకున్నారా? లేదంటే శేఖర్ మాస్టర్ ని తప్పించారా? అనే అనుమానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Why did Sekhar master leave Dhee show:

Dhee Judge Sekhar Master 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ