కేసీఆర్ మంత్రి వర్గం నుండి ఈటెల రాజేంద్ర బర్తరఫ్ అవడం, ఆయనకు సంబదించిన భూముల్లో తెలంగాణా సర్కారు సర్వేలు చేయించడంతో ఈటెల రాజేంద్ర టీఆరెస్ నేతలపై కేసీఆర్ పై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈటెల రాజేంద్ర ని మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేసినప్పటినుండి.. ఆయన కొత్త పార్టీ పెడతారా? లేదంటే కాంగ్రెస్ లో చేరతారా? కాదు బిజెపి పంచకు వెళతారా? అనే దానిపై అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే ఈటెల రాజేంద్ర ఇప్పుడు చాలామంది ప్రతి పక్ష, తన పక్ష నేతలను కలుస్తూ బిజీగా ఉన్నారు.
రాజకీయంగా చేతులు ముడుచుకుని కూర్చోకుండా ఈటెల పావులు కదుపుతున్నారు. తాను చాలా సహనంతో ఓర్పుతో ఉన్నాను అని, లేదంటే టీఆరెస్ నేతల గుట్టు బట్టబయలు చేస్తా అని, తాను చెప్పే విషయాలతో జీవితాలు తారుమారవుతాయంటూ ఈటెల రాజేంద్ర చెబుతున్నదాన్ని బట్టి ఈటెలకు కొంతమంది టీఆరెస్ మంత్రులు, నేతల గుట్టు తెలియబట్టే ఆయన అలా మాట్లాడుతున్నారని, ఆయనపై టీఆరెస్ కక్ష తీర్చుకునే చర్యలు చెయ్యడం వలెనే ఈటెల అలా చెబుతున్నారని ఈటెల అనుచరులు అంటున్నారు.
అయితే టీఆరెస్ కూడా తమ నేతలు ఈటెల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా తాజాగా హుజురాబాద్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటలను వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుక- తిరుపతి రెడ్డి లు ఈటెలని కలిసి మద్దతు తెలిపారు. దానితో టీఆరెస్ కి భారీ షాక్ తగిలింది. ఎందుకంటే రీసెంట్ గా రేణుక టీఆరెస్ మంత్రి గంగులను కలిసి మద్దతు తెలిపి ఇప్పుడు ఈటెల రాజేంద్ర పంచన చేరడం అందరికి షాకిస్తుంది.