నార్త్ లో బిగ్ బాస్ కి ఉన్న క్రేజు సౌత్ లో లేదనే చెప్పాలి. అందులోనూ తెలుగు బిగ్ బాస్ అంటే ఇంకాస్త క్రేజ్ తక్కువ ఉన్నట్లే. బిగ్ బాస్ లోకి వచ్చి క్రేజ్ సంపాదించి కెరీర్ లో ఏదో సాధించేద్దామనుకున్న వారికీ బిగ్ బాస్ ఎప్పటికప్పుడు షాకిస్తూనే ఉంది. దానికి ప్రత్యేక్ష ఉదాహరణలు బిగ్ బాస్ 4 సీజన్స్ లో విన్నర్ అయిన వాళ్లే. ఫస్ట్ సీజన్ విన్నర్ శివబాలాజీ, సెకండ్ సీజన్ విన్నర్ కౌశల్, థర్డ్ సీజన్ విన్నర్ రాహుల్ కానీ, రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ కానీ కెరీర్ లో బిజీ అయిన దాఖలాలే లేవు. అయితే బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న కంటెస్టెంట్స్ మాత్రం బాగా బిజీ అయ్యారనే చెప్పాలి. అఖిల్ సార్థక్ ఓ వెబ్ సీరీస్, ఓ మూవీ చేస్తుండగా సోహెల్ హీరోగా రెండు సినిమాలు మొదలయ్యాయి.
ఇక మోనాల్ అయితే ఫుల్ బిజీ. సినిమాలు, బుల్లితెర అంటూ గ్లామర్ షో చేస్తుంది. హారిక ఎప్పట్లాగే యూట్యూబ్, సోషల్ మీడియాలో బిజీ. నోయెల్ కూడా అంతే. లాస్య, అవినాష్, అరియానా టివి షోస్ తో బిజీ. అయితే ఈ సీజన్ లో పాల్గొన్న దివి ఏకంగా మెగా కాంపౌండ్ మూవీస్ లో అవకాశం రావడమే కాదు.. దివి హీరోయిన్ గా ఓ మూవీ కూడా తెరకెక్కింది. అదే దివి మెయిన్ లీడ్ లో ధనరాజ్ వంటి కమెడియన్స్ నటించిన క్యాబ్ స్టోరీస్ మూవీ థియేటర్స్ కోసం వెయిట్ చెయ్యకుండా స్పార్క్ ఓటిటి నుండి మే 28 ప్రేక్షకుల ముందు రాబోతుంది. పోస్టర్ తో రిలీజ్ డేట్ కంఫర్మ్ చేసారు మేకర్స్. మరి దివి ఇదొక్కటే కాదు చాలా సినిమాలు, యాడ్స్ కూడా చేస్తుంది.