Advertisementt

సమంత ని బాగా వాడుతున్నారుగా

Tue 18th May 2021 06:54 PM
the family man 2,samantha akkineni,samantha family man 2,family man 2 trailer release date,manoj bajpayee,priyamani,raj and dk,family man season 2  సమంత ని బాగా వాడుతున్నారుగా
The Family Man season 2 trailer release date and time update సమంత ని బాగా వాడుతున్నారుగా
Advertisement
Ads by CJ

సమంతకి సౌత్ లో సూపర్ క్రేజ్ ఉంది.. పెళ్లయ్యాక కూడా పర్ఫెక్ట్ గ్లామర్ తో, పర్ఫెక్ట్ ఫిజిక్ తో, పర్ఫెక్ట్ రోల్స్ తో ప్రేక్షకులని ఇప్పటికి ఎంటర్టైన్ చేస్తూనే ఉంది సమంత. అయితే సమంత కి పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ఉంది అనడానికి ఎక్కడా ఆధారాలు లేవు. ఎందుకంటే ఇప్పటివరకు సమంత బాలీవుడ్ మూవీస్ లో నటించింది లేదు. కేవలం తెలుగు, తమిళ మూవీస్ లో నటించి బ్లాక్ బస్టర్స్ కొట్టింది. అయితే ఇప్పుడు సమంత నటించిన పాన్ ఇండియా వెబ్ సీరీస్ ఫ్యామిలీ మ్యాన్ పై ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. బాలీవుడ్ లో మనోజ్ భాజపేయీ.. హిందీకి పరిచయం ఉన్న ప్రియమణి ముఖ్యపాత్రలు తెరకెక్కిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ అమెజాన్ ప్రైమ్ లో సూపర్ హిట్ అవడంతో దానికి సీక్వెల్ గా రాజ్, డీకే ద్వయం ఈ ఫ్యామిలీ మ్యాన్ 2 ని తెరకెక్కించింది.

అయితే అందులో సమంత నటిస్తుంది అనగానే సౌత్ నుండి బిగ్గెస్ట్ క్రేజ్ ఆ వెబ్ సీరీస్ పై ఏర్పడింది. అందులోనూ డీ గ్లామర్ గా, రాజి పాత్రలో నెగెటివ్ షేడ్స్ అనేసరికి సమంత పై సౌత్ ప్రేక్షకుల్లో ఉత్సుకత పెరిగిపోతుంది. ఇక్కడ సమంత క్రేజ్ ని బాగానే వాడేస్తున్నారు ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్. సమంత ని ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ లో తెగ హైలెట్ చేస్తున్నారు. పోస్టర్స్ లోనూ, ట్రైలర్ లోనూ విపరీతమైన ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎందుకంటే రాజ్ అండ్ డీకే లు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ చూసాక సమంత కేరెక్టర్ పై ఒక అవగాహన వస్తుంది అని చెప్పడం, ట్రైలర్ రిలీజ్ అప్ డేట్ పోస్టర్ లోనూ సమంత ని చూపెట్టడంతో సమంత క్రేజ్ ని బాగానే వాడుకుంటున్నారు మేకర్స్ అంటున్నారు అభిమానులు. 

సమంత లుక్స్ లో అమాయకత్వం, మేకప్ లేకపోవడం అన్ని నిజంగానే అంచనాలు పెంచేస్తున్నాయి. అక్కినేని అభిమానులైతే.. మా సమంత క్రేజ్ ఒక్కటి చాలు ఈ వెబ్ సీరీస్ హిట్ అవడానికి అంటున్నారు. మరి రేపు ఉదయం 9 గంటలకు ఈ హిట్ సీక్వెల్ ట్రైలర్ ని రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా టీం అప్ డేట్ ఇచ్చేసింది.

The Family Man season 2 trailer release date and time update:

The Family Man 2: Trailer release date and time out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ