Advertisementt

నెగెటివ్ రోల్ లో సమంత ఇరగదీసింది

Wed 19th May 2021 11:01 AM
family man season 2,the family man season 2 trailer,samantha akkineni,manoj bajpeyee,priyamani,raj and dk,family man season 2 trailer review  నెగెటివ్ రోల్ లో సమంత ఇరగదీసింది
The Family Man Season 2 Trailer released నెగెటివ్ రోల్ లో సమంత ఇరగదీసింది
Advertisement
Ads by CJ

గత కొన్ని రోజులుగా ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ ట్రైలర్ తో పాటుగా రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసారు. సౌత్ ఇండియా క్వీన్ సమంత అక్కినేని కేరెక్టర్ ని ట్రైలర్ లో రివీల్ చేసేసారు. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ వన్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ సీజన్ 2 లో మనోజ్ భాజపేయీ - ప్రియమణి భార్య భర్తలుగా చిలిపి తగాదాలు, ఫ్యామిలీ డ్రామా, సమంత ఏకంగా టెర్రరిస్ట్ పాత్రలో సూసైడ్ బాంబర్ గా కనిపించి షాక్ ఇచ్చింది. డీ గ్లామర్ లుక్ లో సమంత పెరఫార్మెన్స్ అద్భుతః. వాళ్లను నేను చంపేస్తా అంటూ సమంత చెప్పిన డైలాగ్, సమంత లుక్స్ అన్ని అదిరిపోయాయి.

ఫ్యామిలీ మ్యాన్ లో కనిపించిన యాక్షన్ తో పోలిస్తే.. సీజన్ 2 లో మరిన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ని జోడించారు. సమంత కూడా యాక్షన్ సీక్వెన్స్ లలో ఇరగదీసింది. మొదటిసారి ఓ డిఫరెంట్ రోల్ లో సమంత ఆకట్టుకుంది. ఫామిలీ మ్యాన్ ట్రైలర్ మొత్తం మనోజ్ బాజ్ పేయి.. సమంత, ప్రియమణి ల చుట్టనే తిరిగినట్టుగా కట్ చేసి సీజన్ 2 పై ఇప్పటికే ఉన్న అంచనాలు పెంచేశారు డైరెక్టర్ రాజ్ అండ్ డీకే. ఇక ముందు నుండి చెప్పినట్లుగానే పోస్టర్స్ లోనే కాదు.. ట్రైలర్ లోనూ సమంత ని ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తుంది. మనోజ్ భాజపేయీ తో సమానంగా సమంత రోల్ ని ట్రైలర్ లో చూపించారు. మరి మోస్ట్ అవైటెడ్ వెబ్ సీరీస్ ని జూన్ 4 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చెయ్యబోతున్నట్టుగా డేట్ ప్రకటించింది ఫామిలీ మ్యాన్ టీం. 

The Family Man Season 2 Trailer released :

The Family Man Season 2 Trailer review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ