Advertisementt

పుష్ప ఫస్ట్ పార్ట్ ఫినిష్ అయ్యిందా

Wed 19th May 2021 03:04 PM
pushpa movie,allu arjun,sukumar,allu arjun pushpa,pushpa 2 parts,pushpa pan india film  పుష్ప ఫస్ట్ పార్ట్ ఫినిష్ అయ్యిందా
Is Pushpa part 1 finished? పుష్ప ఫస్ట్ పార్ట్ ఫినిష్ అయ్యిందా
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిలిం పుష్ప రెండు పార్ట్ లుగా రాబోతుంది. గత నవంబర్ నుండి మొన్న మే ఫస్ట్ వీక్ వరకు పుష్ప షూటింగ్ కి ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తి చేసింది టీమ్. అల్లు అర్జున్ కి గనక కరోనా రాకపోతే షూటింగ్ ఇంకా జరుగుతుండేదేమో. ప్రస్తుతం విలన్ ఫహద్ ఫాజిల్ అవైలబుల్ గా ఉన్నా సుకుమార్ షూటింగ్ చేస్తుండే వాడే.. కానీ మలయాళ నటుడు ఫహద్ చెన్నై వెళ్లిపోవడంతో పుష్ప షూటింగ్ ఆపక తప్పలేదు. మరి ఇంతవరకు ఎంత షూటింగ్ పూర్తయ్యింది అనే దాని మీద ఓ ప్రశ్న సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

పుష్ప రెండు భాగాలకు సంబందించిన ఓ 30 నిమిషాల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట. అంటే పుష్ప పార్ట్ 1కి కొన్ని, పార్ట్ 2కి కొన్ని స‌న్నివేశాలు జోడించాల్సిన అవ‌స‌రం ఉందట. ఆయా సన్నివేశాలను ఎక్కడెక్కడ జత చేయాలనే దాని మీద సుకుమార్ అండ్ పుష్ప టీం తర్జన భర్జనలు పడుతుందట. అంతేకాదు.. ఫస్ట్ పార్ట్ లో ఓ ఐటమ్ సాంగ్ ఉంటుందట. అలాగే పార్ట్ 2 కి కూడా మరో అదిరిపోయే ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తుందట టీం. ఫస్ట్ పార్ట్ లో సాంగ్స్ కి ఇంపార్టెన్స్ ఉన్నా.. సెకండ్ పార్ట్ లో సాంగ్స్ కి అంతగా ఇంపార్టెన్స్ ఉండదు అని చెప్పుకుంటున్నారు. మరి సుకుమార్ ఆ 30 నిమిషాల కంటెంట్ కోసం స్క్రిప్ట్ లో దూరిపోయి దాన్ని పెంచుకునే పనిలో బిజీ అయ్యాడని అంటున్నారు.

Is Pushpa part 1 finished?:

Makers to add an Item song in Pushpa first part

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ