Advertisementt

కర్ణన్ రీమేక్ డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడా

Wed 19th May 2021 04:01 PM
srikanth addala,direct,karnan remake,dhanush,narappa,asuran remake,bellamkonda srinivas  కర్ణన్ రీమేక్ డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడా
Is Karnan remake director fixed? కర్ణన్ రీమేక్ డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడా
Advertisement
Ads by CJ

ఈమధ్యన తెలుగులోకి తమిళ, మలయాళ సినిమాల రీమేక్స్ ఎక్కువయ్యాయి. చిరు లూసిఫెర్ మలయాళ రీమేక్ చేస్తుంటే .. పవన్ బాలీవుడ్ పింక్ రీమేక్ తో హిట్ కొట్టి, అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ చేస్తున్నాడు. ఇక వెంకటేష్ మలయాళ దృశ్యం రీమేక్ చేసేసి తమిళ అసురన్ ని నారప్ప గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో కంప్లీట్ చేసేసాడు. ఇలా అక్కడ తెలుగులో రీమేక్ ల పర్వం కొనసాగుతుంది. అయితే తాజాగా తమిళంలో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ కర్ణన్ రీమేక్ హక్కులని బెల్లంకొండ శ్రీనివాస్ కొనేసినట్లుగా అఫీషియల్ న్యూస్ వచ్చేసింది.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కర్ణన్ రీమేక్ చెయ్యబోతున్నారు. అయితే దానికి దర్శకుడు సెట్ అయ్యాడనే టాక్ మొదలైంది. అతనెవరో కాదు వెంకటేష్ హీరోగా అసురన్ రీమేక్ చేసిన శ్రీకాంత్ అడ్డలేనట. అసురన్ లాంటి సబ్జెక్టు ని శ్రీకాంత్ అడ్డాలా ఎలా డీల్ చేసాడో అనే ఆత్రుత ఇంకా తీరకుండానే శ్రీకాంత్ ని కర్ణన్ రీమేక్ చేసే అవకాశం వచ్చేసింది అంటున్నారు. ఇప్పటికే బెల్లంకొండ బ్యాచ్ శ్రీకాంత్ అద్దాలని కర్ణన్ రీమేక్ విషయమై సంప్రదించినట్టుగా తెలుస్తుంది. అయితే శ్రీకాంత్ అడ్డాల మాత్రం నారప్ప సినిమా విడుదలయ్యేవరకు వెయిట్ చేసి ఓకె చెప్పాలని అనుకుంటున్నాడట. ఒకవేళ నారప్ప విడుదలవకుండా మళ్లీ మరో రీమేక్ అంటే ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అని శ్రీకాంత్ అడ్డాల ఆలోచనట.

కానీ బెల్లకొండ సురేష్ కి మాత్రం అద్దాలని వదిలే ఉద్దేశ్యం లేదని అంటున్నారు. 

Is Karnan remake director fixed?:

Srikanth Addala To Direct Karnan Remake With Bellamkonda

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ