ఎలాంటి ఫిల్మీ బ్యాగ్రౌండ్ లేకుండా చాలా తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ ని అందుకున్న విజయ్ దేవరకొండ క్రేజ్ ఇప్పడు పాన్ ఇండియా లెవల్లో ఉంది. అప్ కమింగ్ హీరోయిన్స్, బాలీవుడ్ హీరోయిన్స్ మాత్రమే కాదు.. మాజీ హీరోయిన్స్ కూడా విజయ్ దేవరకొండ అంటే క్రష్ అంటూ ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం లైగర్ పాన్ ఇండియా మూవీ చేస్తున్న విజయ్ దేవరకొండ పైకి సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు. రౌడీ బ్రాండ్స్ తో యూత్ లోకి దూసుకెళ్లిన విజయ్ దేవరకొండ కి రౌడీ ఫాన్స్ పాలతో అభిషేకాలు చేసేంత, చేతులకి పచ్చ బొట్లు పొడిపించుకునేంత క్రేజ్ ఉంది.
అయితే సోషల్ మీడియాలో చాలా తక్కువ సమయంలో మంచి ఫాలోవర్స్ సంపాదించుకున్నాడు ఈ రౌడీ స్టార్. అటు ట్విట్టర్, ఫేస్ బుక్ కన్నా విజయ్ దేవరకొండ క్రేజ్ ఇన్స్టాలో భీభత్సంగా ఉంది. రీసెంట్ గా విజయ్ ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా 12 మిలియన్ ఫాలోవర్స్ ను లాక్ చేసాడు. చాలా ఫాస్ట్ గా 12 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగిన సౌత్ ఇండియన్ స్టార్ గా విజయ్ రికార్డు సృష్టించాడు. బాలీవుడ్ లోనూ విజయ్ దేవరకొండ క్రేజ్ మాములుగా లేదు. అక్కడ హీరోయిన్స్ అంతా ఎప్పుడు విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ దొరుకుంతుందో అని ఎదురు చూస్తున్నారు.