Advertisementt

ప్రభాస్ తో కూల్ గా.. ఎన్టీఆర్ తో వైలెంట్ గా

Thu 20th May 2021 05:19 PM
kgf director,prashanth neel,ntr birthday,salaar movie,ntr31,prabhas,ntr  ప్రభాస్ తో కూల్ గా.. ఎన్టీఆర్ తో వైలెంట్ గా
Cool with Prabhas, violent with NTR ప్రభాస్ తో కూల్ గా.. ఎన్టీఆర్ తో వైలెంట్ గా
Advertisement
Ads by CJ

ప్రభాస్ తో చడీ చప్పుడు లేకుండా చాలా సైలెంట్ గా సలార్ సినిమా అనౌన్స్ చేసాడు కన్నడ కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కెజిఎఫ్ మూవీ తో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్లో భారీ ఫెమ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ వెంట టాలీవుడ్ స్టార్స్ పడ్డారు. అందులో అందరికన్నా ముందు ఎన్టీఆర్ ఉన్నాడు. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ న్యూస్ చూడగానే ఫాన్స్ పండగ చేసుకున్నారు. గత ఏడాది బర్త్ డే రోజున ఎన్టీఆర్ ని న్యూక్లియర్ ప్లాంట్ తో పోలిచేసాడు ప్రశాంత్ నీల్.. న్యూక్లియర్ ప్లాంట్ పక్కన రేడియేషన్ సూట్ వేసుకుని కూర్చోవాలంటూ ఎన్టీఆర్ మాసిజాన్ని పవర్ ఫుల్ మాటలతో చెబుతూ విష్ చేసాడు. కానీ ప్రభాస్ తో ముందు మూవీ మొదలు పెట్టాడు ప్రశాంత్ నీల్.

ఇక ఈ ఏడాది ఎన్టీఆర్ బర్త్ డే కి కూడా ప్రశాంత్ నీల్ అలానే రక్తంతో తడిసిన నేల ఒక్కటి మాత్రమే గుర్తుచుకుంటుంది అని, తన ఒకే ఒక్క ఫోర్స్ ఎన్టీఆర్ తో ఈ సినిమా చెయ్యడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అంటూ మరోసారి పవర్ ఫుల్ పదాలను వాడాడు ప్రశాంత్ నీల్. హీరోలని ఒక రేంజ్ లో చూపించగల ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని సలార్ లో అంతే పవర్ ఫుల్ గా చూపించబోతున్నాడు. అయితే ఎన్టీఆర్ ని సోషల్ మీడియాలో పవర్ ఫుల్ పదాలతో పైకి లేపినట్టుగా కాకుండా.. ప్రభాస్ తో కూల్ గా సలార్ ఫస్ట్ లుక్ తో కొట్టాడు.

అక్కడ మాటల్లేవ్ చేతలే అన్నట్టుగా సలార్ లో మాస్ పవర్ ఫుల్ లుక్ తో ప్రభాస్ ఫాన్స్ ని పడేసాడు. ఇక్కడ పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఎన్టీఆర్ ఫాన్స్ ని పడేస్తున్నాడు. అందుకే.. ప్రశాంత్ నీల్ నువ్వు మాములోడివి కాదయ్యా అంటున్నారు నెటిజెన్స్.

Cool with Prabhas, violent with NTR:

Kgf Director Prashanth neel birthday wishes to Ntr

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ