టు డే ఎన్టీఆర్ బర్త్ డే.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా #Tarak, #NTR, #KomaramBheem, #NTR30, #NTR31, #JaiNTRAnna అనే హాష్ టాగ్స్ తో అప్ డేట్స్ ఇవే కనిపిస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్ ఇలా దేనిలో చూసినా ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ చెప్పేవాళ్ళే. ఎన్టీఆర్ బర్త్ డే కి సంబరాలు చేసుకోపోతేనేమి.. ఎన్టీఆర్ మూవీ అప్ డేట్స్ తో ఎన్టీఆర్ ఫాన్స్ ఫుల్ గ పండగ చేసుకున్నారు. ఒకటా రెండా ఏకంగా మూడు సినిమాల అప్ డేట్స్ తో ఫాన్స్ ఎన్టీఆర్ బర్త్ డే ని సెలెబ్రేట్ చేసుకున్నారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకున్నాడు ఎన్టీఆర్. కరోనా పాజిటివ్ తో ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్న ఎన్టీఆర్ బర్త్ డే వేడుకలు దూరంగా ఉన్నాడు.
ఇకపోతే ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ తన తదుపరి మూవీ కొరటాల శివ తో చేస్తుంటే.. ఆ నెక్స్ట్ NTR31 ని ప్రశాంత్ నీల్ తో చేస్తున్నట్లుగా నేడు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇక నెక్స్ట్ విషయం ఎవరూ అంతగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఈ మూడు సినిమాల అప్ డేట్స్ తో ఎన్టీఆర్ ఫాన్స్ మరో ఆలోచన లేకుండా దిల్ ఖుష్ అవుతున్నారు. మరి అదే వరసలో ఎన్టీఆర్ నెక్స్ట్ అంటూ ఉప్పెన డైరెక్టర్ హింట్ ఇచ్చేసాడు. ఉప్పెన సినిమా విడుదలైన దగ్గరనుండి బుచ్చి బాబు సాన - మైత్రి మూవీస్ మేకర్స్ కలిసి ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నారనే టాక్ నడుస్తున్నా.. అంతగా ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ కమిట్ అవ్వలేదు.. అందులో ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ మెయింటింగ్ చేస్తున్నాడు కాబట్టి.
కానీ ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ చెబుతూ.. ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు వెయిటింగ్ లో ఉన్నట్లుగా.. లోకల్ స్టోరీని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పి ఒక ట్రెండ్ సృష్టిద్దాం సార్.. Happy Birthday Nandamuri Taraka Ramarao garu
Waiting sir.....
LET'S CREATE A TREND telling a LOCAL STORY GLOBALLY
Thanks for unconditional love and affection sir...
@tarak9999
అంటూ బుచ్చిబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసరికి ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కోసం బుచ్చిబాబు కథ రాస్తున్నాడా? లేదంటే ఎన్టీఆర్ కోసం తానే పాన్ ఇండియా కథ సిద్ధం చేస్తున్నాడో? కానీ ఎన్టీఆర్ లిస్ట్ లో బుచ్చి బాబు కూడా అఫీషయల్ గా చేరిపోయినట్లే అనిపిస్తుంది.