క్రిష్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ తో కంచె మూవీ లో నటించిన ప్రగ్య జైస్వాల్ కి కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ లేకపోయినా.. ఒకటో ఆరో అవకాశాలతో పాప బాగా బిజీగానే ఉంటుంది. తెలుగులో బాలకృష్ణ సరసన అఖండ మూవీలో నటిస్తున్న ప్రగ్యా జైస్వాల్ బాలీవుడ్ లో అంతిమ్ మూవీలో నటిస్తుంది. ఈ ఇండస్ట్రీలో తాను కూడా భాగంగా కావడం అదృష్టం అని చెబుతున్న ప్రగ్య జైస్వాల్ ఒకప్పటిలా చిత్ర పరిశ్రమ లేదు. అన్ని విధాలుగా సినిమా ఇండస్ట్రీ చాలా ముందుకు వెళ్ళిపోయింది. కేవలం హీరోలే ఏళ్ళకి తరబడి ఇండస్ట్రీలో ఉండే పరిస్థితులతో పాటుగా.. హీరోయిన్స్ కూడా ఏళ్ళకి తరబడి సినిమా ఇండస్ట్రీలో ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఒకప్పుడు హీరోయిన్స్ కి పెళ్ళైతే ఇక వాళ్ళకి అవకాశాలు రావు, ఎవరూ అవకాశాలు ఇవ్వరు దాదాపుగా కెరీర్ ముగిసిపోయినట్టే అనుకునే వారు. కానీ పెళ్లయ్యాక కూడా సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ పలు అవకాశాలతో దూసుకుపోతున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. ఉదాహరణకి బాలీవుడ్ లో దీపికా పడుకొనే, కరీనా కపూర్ లాంటి వాళ్ళు ఇప్పటికీ టాప్ రేసులో దూసుకుపోతున్నారు అంటుంది. ఇక అఖండ లో తాను నటించడంతో తన ఖాతాలో ఓ భారీ బడ్జెట్ చిత్రం చేరింది అని.. షూటింగ్ చివరి దశలో ఉన్న అఖండ ప్రస్తుతం కరోనా ప్రభావంతో షూటింగ్స్ ఆపాల్సి వచ్చింది అని చెబుతుంది.