నరసాపురం ఎంపీ రఘురామరాజుకి కి సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దేశ ద్రోహం కేసులో ఏపీ సీఐడీ గత శుక్రవారం రఘురామరాజుని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి గుంటూరు జైలు కి తరలించగా.. ఆయనకు బెయిల్ ఇప్పించాలంటూ రఘురామ కొడుకు హై కోర్టు లో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ని హై కోర్టు కొట్టివేసింది. ముందు కింది కోర్టుకి వెళ్లి అక్కడ బెయిల్ కి దరఖాస్తు చేసుకోమని, అయితే అదేరోజు రఘురామరాజుని జైల్లో సీఐడీ పోలీస్ లు కొట్టినట్లుగా కోర్టు లో కేసు వేశారు రఘురామ తరుపు న్యాయవాది.
జీజీహెచ్, రమేష్ హాస్పిటల్స్ లో ఆయనకి టెస్ట్ చేయించమని కోర్టు చెప్పినా ఏపీ సీఐడీ డ్రామాల మధ్యన రఘురామ కేసు సుప్రీం కోర్టుకి వెళ్ళింది. అక్కడ రఘురామరాజు ని ఆర్మీ హాస్పిటల్ లో టెస్ట్ లు చేయించాలని కోర్టు చెప్పగా.. అప్పటినుండి రఘురామరాజు సికింద్రాబాద్ లోని ఆర్మీ హాస్పిటల్ లోనే ఉన్నారు. రఘురామ కేసులో ఈ రోజు ఏపీ ప్రభుత్వం - రఘురామా లాయర్ల వాదోపవాదనలు విన్న తర్వాత ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను సుప్రీం కోర్టు మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించి రఘురాజు మీడియా లేదా సోషల్ మీడియా ముందు మాట్లాడకూడదని ఆదేశించింది. రఘురామరాజుకి కస్టోడియల్ విచారణ అవసరం లేదని, న్యాయవాది సమక్షంలోనే విచారణ జరగాలని ఆదేశించింది. పోలీసు విచారణకు రఘురాజు సహకరించాలని అలాగే పోలీసుల కస్టడీలో ఆయన పట్ల దురుసుగా వ్యవహరించారనే అభిప్రాయాన్ని న్యాయస్థానం వ్యక్తం చేసింది.