Advertisementt

అప్పుడు బాహుబలి, ఇప్పుడు సలార్

Sun 23rd May 2021 10:27 PM
prabhas,salaar movie,salaar pan india film,rajamouli,prashanth neel,baahubali,prabhas six pack treat  అప్పుడు బాహుబలి, ఇప్పుడు సలార్
Then Bahubali, now Salaar అప్పుడు బాహుబలి, ఇప్పుడు సలార్
Advertisement
Ads by CJ

కెజిఎఫ్ తో ఒక్కసారిగా అందరి చూపు తన మీద పడేలా చేసుకున్న కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి టాలీవుడ్ స్టార్ హీరోస్ రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ముందుగా ప్రభాస్ సలార్ తో ప్రశాంత్ నీల్ ని లాక్ చెయ్యగా.. ఆ తరవాత ఎన్టీఆర్ తో మరో మాస్ పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసారు. అయితే హీరో ఎలివేషన్ సీన్స్ లో ప్రశాంత్ నీల్ స్టయిల్ వేరు. అందుకే స్టార్ హీరోలు ఆ మాస్ డైరెక్టర్ మీద కన్నేస్తున్నారు. ప్రస్తుతం కెజిఎఫ్ 2 షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉండగా.. ప్రశాంత్ నీల్ ప్రభాస్ సలార్ మీద దృష్టి పెట్టాడట. ప్రభాస్ ని మాస్ గా, రఫ్ గా కాకుండా.. స్టైలిష్ మాస్ గా చూపించబోతున్నట్టుగా సలార్ ఫస్ట్ లుక్ లోనే తేలిపోయింది. 

సలార్ పోస్టర్ లో ప్రభాస్ రోల్ పై ఓ క్లారిటీ వచ్చేసింది. ప్రభాస్ మాస్ పవర్ ఫుల్ పాత్ర చేయబోతున్నాడని తెలుస్తుంది. అయితే బాహుబలిలో రాజమౌళి ప్రభాస్ ని ఎంతగా వాడేసాడో.. ప్రభాస్ ని ఎంత బాగా చూపించాడో.. ఇప్పుడు సలార్ లోనూ ప్రశాంత్ నీల్ ప్రభాస్ కటౌన్ ని అంతే పర్ఫెక్ట్ గా వాడబోతున్నాడని తెలుస్తుంది. ప్రభాస్ ఫిజిక్ తో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లలో ప్రభాస్ మాస్ ని చూస్తారని అంటున్నారు. అలాగే ప్రభాస్ తో సిక్స్ ప్యాక్ లుక్ లో ఓ సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్ ని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసాడనే టాక్ వినిపిస్తుంది. బాహుబలిలో రాజసం ఉట్టిపడేలా ప్రభాస్ ని ఎంత అద్భుతంగా చూసామో.. సలార్ లో మాస్ గా ప్రభాస్ ని అంతే స్టైలిష్ గా చూస్తామని చెబుతున్నారు.

Then Bahubali, now Salaar:

Prabhas six pack treat in Salaar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ