రాధేశ్యామ్ బ్యూటీ పూజ హెగ్డే.. ప్రస్తుతం సెకండ్ వేవ్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో.. పేరెంట్స్ తో కలిసి ఇంట్లోనే గడుపుతుంది. పూజ హెగ్డే అప్పుడప్పుడు త్రో బ్యాక్ పిక్చర్స్ అంటూ అందమైన, గ్లామరస్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ యూత్ కి నిద్ర లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే కరోనా బారిన పడి కోలుకుంది. నిత్యం యోగ, ప్రోటీన్ ఫుడ్ తీసుకుని కరోనా నుండి కోలుకున్నట్లుగా చెప్పిన పూజ హెగ్డే కరోనాకి భయపడను అంటుంది. అయితే తాజాగా పూజ హెగ్డే సోషల్ మీడియాలో ఓ పిక్ పోస్ట్ చేసింది.
అచ్చం తన డ్రెస్ లాంటి డ్రెస్ వేసుకుని.. అందంగా ఉన్న తన సిస్టర్ తో కలిసి పిక్ దిగి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. Twinning with the pup అంటూ ట్వీట్ చేసింది. పూజ హెగ్డే, పూజ పక్కన ఉన్న ఆమె సిస్ ఒకే లాంటి పైజామా డ్రెస్సు తో మెరిసిపొతున్నారు. అందమైన పూజ హెగ్డే పక్కన మరో అందమైన అమ్మాయిని చూసిన నెటిజెన్స్ పూజ లాగే అందంగా ఉంది ఆమె సిస్టర్ కూడా. ఇద్దరూ ఒకేలాంటి డ్రెస్ కాదు.. ఒకేలాంటి లుక్స్ తో అదరగొట్టేస్తున్నారు అంటున్నారు.